LokSabha Elections: మోదీ రోడ్ షోలో చెప్పిందే.. జరగబోతుంది
ABN , Publish Date - May 25 , 2024 | 08:53 PM
ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ.. దాని మిత్ర పక్షాలు నాలుగు వందలకుపైగా లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
న్యూడిల్లీ, మే 25: ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ.. దాని మిత్ర పక్షాలు నాలుగు వందలకుపైగా లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ఇది తమ ప్రచార నినాదం కాదని.. తమ విధానమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆరు దశల పోలింగ్ అనంతరం ఆ సంఖ్యను దాటుతామని ఆయన పేర్కొన్నారు.
శనివారం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. ఈ ఎన్నికల్లో 400 స్థానాలకుపైగా స్థానాలు గెలుకుని.. పశ్చిమ భారతంలో సైతం బీజేపీ తనదైన ముద్ర వేసుకుంటుందని మే 12న బిహార్ రోడ్ షోలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్బంగా ఆయన ప్రస్తావించారు.
LokSabha Elections: ఏనుగు దాడి.. వృద్ధుడు మృతి
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తాను పర్యాటించానని చెప్పారు. అయితే బిహార్‌లో సైతం తమ పార్టీ సత్తా చాటుందన్నారు. బిహార్‌లో కనిపించిన వాతావరణమే.. దేశవ్యాప్తంగా కనిపిస్తుందని రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు.
LokSabha Elections: ఈవీఎంలకు బీజేపీ ట్యాగ్.. స్పందించిన ఈసీ
ఈ ఎన్నికల్లో లఖ్‌నవూ లోక్‌సభ స్థానం నుంచి ముచ్చటగా మూడోసారి రాజ్‌నాథ్ సింగ్ ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. గతంలో అంటే 2014,2019 ఎన్నికల్లో ఆయన ఇదే స్థానం నుంచి గెలుపొందారు. అయితే 2019లో మోదీ కేబినెట్‌లో రాజ్‌నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
TG Politics: కేటీఆర్‌పై ఈసీకి ఫిర్యాదు చేస్తాం
ఆ క్రమంలో రక్షణ శాఖ మంత్రిగా మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్బర భారత్ స్పూర్తికి అనుగుణంగా రక్షణ శాఖకు చెందిన 101 విదేశీ పరికరాలను ఆయన నిషేధించారు. అలాగే మిలటరీకి చెందిన 108 ఆయుధాలను స్వదేశంలోనే తయారు చేసుకొనేలా రాజ్‌నాథ్ సింగ్ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.
Read Latest News and National News here