Home » M.K Stalin
తమిళనాడు(Tamilnadu)కు కావేరీ జలాల్ని(Kaveri River) విడుదల చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక(Karnataka) వ్యాప్తంగా ఆ ప్రాంత ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 29న బెంగళూరు బంద్(Bengaluru) కు పిలుపునిచ్చారు. ఆ రోజు రాజధానిలోని అన్ని బడులకు సెలవులు ప్రకటించారు.
టర్కీలో చికిత్స పొందుతున్న పాపను ఎయిర్ అంబులెన్స్‌లో చెన్నైకి తరలించేందుకు గానూ ప్రభుత్వం తరుఫున రూ.10 లక్షలు ప్రకటించారు సీఎం స్టాలిన్
తమిళనాడు(Tamilnadu) మంత్రి స్టాలిన్(MK Stalin) కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udaynidhi Stalin) ఇటీవల సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నటుడు, మక్కల్ నీదీ మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్(Kamal Hasan) స్పందించారు.
మనీలాండరింగ్(Money Laundering) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు మంత్రి వి. సెంథిల్ బాలాజీ(Senthil Balaji)కి చెన్నై(Chennai) కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన బెయిల్ పిటిషన్ కొట్టివేస్తున్నట్లు కోర్టు బుధవారం స్పష్టం చేసింది.
చెన్నై: తమిళనాడు(Tamilnadu)లో ప్రతిపక్ష అన్నాడీఎంకే, బీజేపీల మధ్య రచ్చ తారా స్థాయికి చేరింది. దీంతో ఇరు పార్టీల నేతలు బహిరంగాగానే విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఏఐఏడీఎంకే(AIADMK)కే సీనియర్ నేత డి.జయకుమార్ రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీతో తమ పార్టీ పొత్తు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.
తమిళనాడులోని 13 జిల్లాల్లో ఉన్న 19 శ్రీలంక తమిళ శరణార్ధుల శిబిరాల్లో కొత్తగా నిర్మించిన 1,500కు పైగా ఇళ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఆదివారంనాడు ప్రారంభించారు. రూ.79.70 కోట్లతో 1,591 ఇళ్లను నిర్మించారు.
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల(Parliament Special Sessions) పేరుతో బీజేపీ(BJP) డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) విమర్శంచారు. బీజేపీని విమర్శిస్తూ ఆయన ఎక్స్(X) లో పోస్ట్ చేశారు.
సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చెప్పిన నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు కే అణ్ణామలై ఘాటుగా స్పందించారు. సనాతన ధర్మంలో వచ్చిన సమస్యలను పరిష్కరించడం కోసం ఎప్పటికప్పుడు అదే ధర్మం నుంచి సాధువులు, స్వామీజీలు ఉద్భవించారని చెప్పారు.
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. సనాతన ధర్మంపై తన కుమారుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల గురించి తెలియకుండానే వ్యాఖ్యలు చేయడం సరికాదని దుయ్యబట్టారు.
సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ వంటిదని, దీనిని కేవలం వ్యతిరేకించడం కాకుండా పూర్తిగా నిర్మూలించాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఇది సాంఘిక న్యాయానికి, సమానత్వానికి వ్యతిరేకమని తెలిపారు. సనాతన ధర్మ నిర్మూలన సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.