AIADMK on BJP: బీజేపీతో పొత్తు లేదు, ఎన్నికల సమయంలోనే నిర్ణయం తీసుకుంటాం: జయకుమార్

ABN , First Publish Date - 2023-09-18T17:55:24+05:30 IST

చెన్నై: తమిళనాడు(Tamilnadu)లో ప్రతిపక్ష అన్నాడీఎంకే, బీజేపీల మధ్య రచ్చ తారా స్థాయికి చేరింది. దీంతో ఇరు పార్టీల నేతలు బహిరంగాగానే విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఏఐఏడీఎంకే(AIADMK)కే సీనియర్ నేత డి.జయకుమార్ రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీతో తమ పార్టీ పొత్తు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.

AIADMK on BJP: బీజేపీతో పొత్తు లేదు, ఎన్నికల సమయంలోనే నిర్ణయం తీసుకుంటాం: జయకుమార్

చెన్నై: తమిళనాడు(Tamilnadu)లో ప్రతిపక్ష అన్నాడీఎంకే, బీజేపీ(BJP)ల మధ్య రచ్చ తారా స్థాయికి చేరింది. దీంతో ఇరు పార్టీల నేతలు బహిరంగాగానే విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఏఐఏడీఎంకే(AIADMK)కే సీనియర్ నేత డి.జయకుమార్ రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీతో తమ పార్టీ పొత్తు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల(Elections) సమయంలోనే పొత్తు అంశాలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై ఏఐడీఎంకే నేత సీఎన్ అన్నాదురైపై చేసిన విమర్శలను జయకుమార్ ఖండించారు.


దివంగత ముఖ్యమంత్రి జయలలిత సహా ఏఐఏడీఎంకే నేతలపై అన్నామలై విమర్శలు చేశారు. తీవ్రంగా స్పందించిన ఏఐఏడీఎంకే అధిష్టానం ఆయన్ని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించింది. బీజేపీ కార్యకర్తలు ఏఐఏడీఎంకేతో పొత్తు కోరుకుంటున్నప్పటికీ.. అన్నామలై దానికి ఇష్టపడట్లేదని అందుకే తమ నేతలపై చిల్లర విమర్శలు చేస్తున్నారని ఓ మాజీ మంత్రి విమర్శించారు. తమిళనాడులో బీజేపీ ఓట్ల శాతం ఎంతో తెలుసని.. ఇక్కడ బీజేపీ లేదని అన్నారు. ఇది మీ వ్యక్తిగత అభిప్రాయమా అని జయకుమార్‌ను ప్రశ్నించగా.. పార్టీ తీసుకున్న నిర్ణయాలే తాను చెబుతున్నట్లు స్పష్టం చేశారు.

Updated Date - 2023-09-18T17:57:55+05:30 IST