Senthil Balaji: మంత్రికి షాక్.. బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
ABN , First Publish Date - 2023-09-20T18:14:03+05:30 IST
మనీలాండరింగ్(Money Laundering) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు మంత్రి వి. సెంథిల్ బాలాజీ(Senthil Balaji)కి చెన్నై(Chennai) కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన బెయిల్ పిటిషన్ కొట్టివేస్తున్నట్లు కోర్టు బుధవారం స్పష్టం చేసింది.
చెన్నై: మనీలాండరింగ్(Money Laundering) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు మంత్రి వి. సెంథిల్ బాలాజీ(Senthil Balaji)కి చెన్నై(Chennai) కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన బెయిల్ పిటిషన్ కొట్టివేస్తున్నట్లు కోర్టు బుధవారం స్పష్టం చేసింది. మాజీ దివంగత సీఎం జయలలిత(Jayalalitha) ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేశారని బాలాజీపై ఆరోపణలు ఉన్నాయి. మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఆయనను జూన్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) అరెస్టు చేసింది. ఆయన అరెస్ట్ రాజకీయ వివాదానికి దారితీసింది.
అన్నాడీఎం(AIADMK)కే ప్రభుత్వ హయాంలో డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారన్న (Cash-for-jobs) స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో గత జూన్ 14న బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసింది. గత నెలలో కోర్టు సెంథిల్ బాలాజీ జ్యుడీషియల్ కస్టడీ(Judicial Custody)ని సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. అతని అరెస్టును సమర్థిస్తూ మద్రాసు హైకోర్టు(Madras High Court) ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.ఆయన ప్రస్తుతం పోర్ట్‌ఫోలియో లేకుండా మంత్రిగా ఉన్నారు. ఆయనకు సీఎం స్టాలిన్ మద్దతు ఇచ్చారు. స్టాలిన్ తన వైఖరిపై పునరాలోచించుకోవాలని రెండు వారాల క్రితం హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుతం సెంథిల్ బాలాజీ పోర్ట్‌ఫోలియో లేని మంత్రి. అంటే.. ఆయనకు ఏ శాఖ కేటాయించరు. ఆయన్ని మంత్రిగా కొనసాగించడం వల్ల ప్రయోజనం ఉండదని అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోర్టు తాజా తీర్పుతో ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.