Home » Madhavi Latha
హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. పోలీసులు ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్నారా..? లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పు చేతలో ఉన్నారా...? అని మండిపడ్డారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాతబస్తీలో ఇప్పటి నుంచి ఒవైసీ బ్రదర్స్(Owaisi Brothers) చట్టవ్యతిరేక ఆటలు సాగనివ్వనని బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత(Madhavilatha) హెచ్చరించారు. ఆదివారం ఐఎస్‌సదన్ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో(Hyderabad) మూడు ఎంపీ సీట్లపై కమలం(BJP) పార్టీ దృష్టి పెట్టింది. ఈసారి మూడు స్థానాలను కైవసం తీసుకునే దిశగా వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో మూడు చోట్ల బలమైన అభ్యర్థులనే బరిలోకి దింపింది. ముగ్గురు అభ్యర్థులు అప్పుడే విస్తృతంగా తమ నియోజకవర్గాల్లో(Parliament Constituency) పర్యటిస్తున్నారు. అన్ని పార్టీల కంటే బీజేపీ ప్రచారంలో ముందంజలో ఉంది. ముగ్గురు అభ్యర్థులు ఇప్పటికే ఒకసారి..
నగరంలోని హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఓటమి ఎరుగని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీని ఢీకొట్టడానికి ధార్మికవేత్త, కళాకారిణి, వ్యాపారవేత్త డాక్టర్ కొంపెల్ల మాధవీలతకు బీజేపీ అధిష్ఠానం అవకాశం ఇచ్చింది.
నగరంలో బీజేపీ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. పాతబస్తీలో పార్టీని పటిష్టం చేయాలనే ధ్యేయంతో అడుగులు వేస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానంలో మజ్లి్‌సకు గట్టి పోటీ ఇచ్చేందుకు విరించి ఆస్పత్రి, లతామా ఫౌండేషన్‌ల చైర్‌పర్సన్ మాధవీలతకు టికెట్ ఖరారు చేసింది. మజ్లి్‌సకు దీటుగా ఉండేందుకే మాధవీలతకు టికెట్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజకీయాలకు మాధవీలత కొత్త. ఆమెకు పార్టీలో గాడ్‌ఫాదర్ ఎవరూ లేరనే చెప్పొచ్చు. ఎంఐఎం కంచుకోటను బద్దలు కొడతానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు.