Madhavilatha: పాతబస్తీలో ఒవైసీ బ్రదర్స్ ఆటలు సాగనివ్వను...
ABN , Publish Date - Apr 21 , 2024 | 12:33 PM
పాతబస్తీలో ఇప్పటి నుంచి ఒవైసీ బ్రదర్స్(Owaisi Brothers) చట్టవ్యతిరేక ఆటలు సాగనివ్వనని బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత(Madhavilatha) హెచ్చరించారు. ఆదివారం ఐఎస్‌సదన్ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
- హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత
హైదరాబాద్: పాతబస్తీలో ఇప్పటి నుంచి ఒవైసీ బ్రదర్స్(Owaisi Brothers) చట్టవ్యతిరేక ఆటలు సాగనివ్వనని బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత(Madhavilatha) హెచ్చరించారు. ఆదివారం ఐఎస్‌సదన్ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మైనార్టీలకు ఒవైసీ చేసిన న్యాయం ఏమిలేదని, కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. ఈ సారి హైదరాబాద్ కోటను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జంగం శ్వేతామధుకర్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వీరేందర్‌యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు మధుకర్‌రెడ్డి, నేతలు మన్నె శ్రీనివాస్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి: Radha Kishan Rao: భారీ భద్రత నడుమ కరీంనగర్‌కు రాధా కిషన్ రావు
సెక్యూరిటీ సిబ్బంది అత్యుత్సాహం
వినయ్‌నగర్ విజయ వినాయక ఆలయంలో ఎంపీ అభ్యర్థి మాధవీ లత ప్రత్యేక పూజలు నిర్వహించే సమయంలో కార్పొరేటర్ జంగం శ్వేతారెడ్డి సెక్యూరిటీ సిబ్బంది నెట్టివేయడం ఉద్రిక్తతకు దారితీసింది. పార్టీ నాయకులు సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మాధవీలత జోక్యం చేసుకుని సర్థి చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
ఇదికూడా చదవండి: Telangana: బీజేపీలో పెద్దపల్లి పంచాయితీ.. అభ్యర్థి మార్పు కన్ఫామా?