BJP: పోలీసులు ఈసీ కోసం పనిచేస్తున్నారా..? లేదంటే కాంగ్రెస్ కోసం వర్క్ చేస్తున్నారా..: మాధవీలత
ABN , Publish Date - Apr 22 , 2024 | 05:41 PM
హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. పోలీసులు ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్నారా..? లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పు చేతలో ఉన్నారా...? అని మండిపడ్డారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత (madhavi latha) పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. పోలీసులు ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్నారా..? లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పు చేతలో ఉన్నారా...? అని మండిపడ్డారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ఎన్నికల ముఖ్య అధికారి వికాస్ రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
Laxman: బీఆర్ఎస్ పని అయిపోయింది.. బీజేపీ మరింత పుంజుకుంది
‘ఎన్నికల వేళ అసదుద్దీన్ తీరు సరిగా లేదు. హిందువుల బాధపడేలా మాట్లాడుతున్నారు. బీఫ్ జిందాబాద్ అని ప్రచారం చేయడం సరికాదు. ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలా వ్యవహరించడం మంచిది కాదు. మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర చేస్తున్నారు. అసదుద్దీన్ ఒవైసీపై చర్యలు తీసుకోండి. అలాగే నేను మసీదుపై బాణం వేయలేదు. ఆ సమయంలో కెమెరాను తిప్పారు. విచారణ చేపట్టకుండా పోలీసులు తనపై కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు ఈసీ పరిధిలో పనిచేస్తున్నారా? అనే సందేహాం కలిగింది. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. పోలీసుల తీరుపై అనుమానాలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ వారిపై దృష్టి సారించాలి అని’ మాధవీలత సీఈవో వికాస్ రాజ్‌ను కోరారు.
CM Revanth Reddy: కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్‌కు రేవంత్ దూరం..
Read Latest Election News or Telugu News