Home » Mahabubnagar
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి ఎం.నవీన్ రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై 111 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎన్ నవీన్ రెడ్డికి763 ఓట్లు, మన్నే జీవన్ రెడ్డి కి 652 ఓట్లు పడ్డాయి. దీంతో ఈ సీటును బీఆర్ఎస్ గెలుపొందింది.
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఆదివారం మహబూబ్‌నగర్‌లో జరుగుతుందని వికా్‌సరాజ్ తెలిపారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. అభ్యర్థులు తక్కువగానే ఉండటంతో తొలి ప్రాధాన్యత ఓట్లతోనే విజేత ఎవరో వెంటనే తేలిపోతుందన్నారు.
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) కార్యాలయం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కౌంటింగ్ కేంద్రాలు, హాళ్లు, టేబుళ్లు, అధికారులు, సిబ్బంది, పోలీసు బందోబస్తు తదితర ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టుల సలహాదారు రంగారెడ్డి (73) సోమవారం కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో కొంత కాలంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రితో చికిత్స పొందుతున్న ఆయనకు సోమవారం సాయంత్రం తీవ్రమైన గుండెనొప్పి వచ్చి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
ఉపాధి కోసం ప్రైవేటు కన్సల్టెన్సీని ఆశ్రయించి మోసపోయిన తెలంగాణ యువకుడు కాంబోడియాలో చిత్రహింసలకు గురవుతున్నాడు. ప్రస్తుతం కాంబోడియా జైల్లో మగ్గుతున్న ఆ యువకుడి దీన పరిస్థితి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
రాష్ట్రవ్యాప్తంగా గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వానకు ప్రజలు వణికిపోయారు. గాలివాన తీవ్రత ఉమ్మడి పాలమూరులో ఎక్కువగా ఉంది..! నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు కొమ్ముగుట్టలో నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు గోడ కూలి నలుగురు మృతి చెందారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) పోద్బలంతో నియెజకవర్గంలో రెండు హత్యలు జరిగాయని.. వెంటనే ఆయనను మంత్రి మండలి నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) డిమాండ్ చేశారు.
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy), అతని బ్రదర్స్‌ను ఏపీ పోలీసులు వెంటాడుతున్నారు. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి క్లియర్ కట్‌గా ఆదేశాలు రావడంతో అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు.
తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాల్లో ఎవరు విజయం సాధించబోతున్నారు. ఓటరు ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. లోక్‌సభ ఎన్నికల్లోనూ 14 సీట్లు గెలవాలని టార్గెట్‌గా పెట్టుకుంది.
సమస్యలు పరిష్కరించలేదంటూ.. అధికారులకు చెప్పినా పట్టించుకోలేదంటూ.. ఆగ్రహానికి గురైన ప్రజలు తమ నిరసన వ్యక్తం చేయడానికి పోలింగ్ బహిష్కరణను అస్త్రంగా ఎంచుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ఎదిర గ్రామంలో పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ 59 రోజులుగా టెంట్ వేసి రిలే నిరాహార దీక్షలు చేస్తున్న స్థానికులు సోమవారం ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.