Share News

బాలల హక్కుల కమిషన్‌ చైర్‌పర్సన్‌గా కొత్తకోట సీతాదయాకర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Apr 05 , 2025 | 05:47 AM

తెలంగాణ బాలల హక్కుల కమిషన్‌ చైర్‌పర్సన్‌గా మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్కాపూర్‌కు చెందిన కొత్తకోట సీతాదయాకర్‌రెడ్డి నియమితులయ్యారు.

బాలల హక్కుల కమిషన్‌ చైర్‌పర్సన్‌గా కొత్తకోట సీతాదయాకర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ

చిన్నచింతకుంట, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ బాలల హక్కుల కమిషన్‌ చైర్‌పర్సన్‌గా మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్కాపూర్‌కు చెందిన కొత్తకోట సీతాదయాకర్‌రెడ్డి నియమితులయ్యారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఆమెతో పాటు ఆరుగురు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ ఉత్వర్వులు జారీ చేశారు.


సీతాదయాక్‌రెడ్డి ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డిని శుక్రవారం సీతాదయాకర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా నియమితులైన సందర్భంగా ఆమెకు సీఎం శుభాకాంక్షలు చెప్పారు. చైర్‌పర్సన్‌గా తనకు అవకాశం కల్పించిన రేవంత్‌ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Apr 05 , 2025 | 05:47 AM