Home » Mahabubnagar
సమస్యలు పరిష్కరించలేదంటూ.. అధికారులకు చెప్పినా పట్టించుకోలేదంటూ.. ఆగ్రహానికి గురైన ప్రజలు తమ నిరసన వ్యక్తం చేయడానికి పోలింగ్ బహిష్కరణను అస్త్రంగా ఎంచుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ఎదిర గ్రామంలో పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ 59 రోజులుగా టెంట్ వేసి రిలే నిరాహార దీక్షలు చేస్తున్న స్థానికులు సోమవారం ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కొందరు ఓటర్లు అత్యుత్సాహం చూపారు. పోలింగ్ కేంద్రంలోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లి నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం హేమ్లాతండాలోని 160వ బూత్‌కు ఓటేయడానికి వచ్చిన బానోత్ బాలకృష్ణ..ఓటు వేస్తూ మొబైల్లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశాడు.
మహబూబ్‌నగర్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ తెలుగు, కన్నడ నటి పవిత్ర జయరామ్ (42) మరణించారు. ఆమె ప్రయాణిస్తున్న కారు వేగంగా డివైడర్‌ను ఢీకొట్టి.. దాని పైనుంచి అవతలివైపు రోడ్డు మీదకు దూసుకెళ్లింది. ఆ లేన్‌లో వెళుతున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టి నుజ్జయింది. పవిత్రది కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లా ఉమ్మదహల్లి గ్రామం. ఆమెతో పాటు పినతల్లి కుమార్తె ఆపేక్ష, మరో నటుడు చంద్రకాంత్ (చందు), డ్రైవర్ శ్రీకాంత్‌తో కలిసి శనివారం సాయంత్రం కారు (స్కార్పియో)లో బెంగళూరు నుంచి హైదరాబాదుకు బయలుదేరారు.
బూబ్‌నగర్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ తెలుగు, కన్నడ నటి పవిత్ర జయరామ్ (42) మరణించారు. ఆమె ప్రయాణిస్తున్న కారు వేగంగా డివైడర్‌ను ఢీకొట్టి.. దాని పైనుంచి అవతలివైపు రోడ్డు మీ దకు దూసుకెళ్లింది
ఎన్నికలు.. ఓటర్లు.. అనగానే పురుషులు ఎంతమంది!? మహిళలు ఎంతమంది అని చూస్తారు కానీ.. మొత్తం ఓటర్లలో యువత సగానికి సగం ఉన్నారని తెలుసా!?
గ్రేటర్ హైదరాబాద్‌లో కీలకంగా ఉన్న సికింద్రాబాద్, మల్కాజిగిరి ఎంపీ స్థానాలను.. వాటితోపాటు మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులేస్తోంది.
బీజేపీ (BJP) దేశాన్ని పదేళ్ల నుంచి పరిపాలిస్తుందని.. దేశానికి ఏం చేసిందని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Telangana: ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక సీఎం మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో పర్యటించారని.. మహిళా అన్న ఇంగితలేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్లు ముప్పేటదాడి చేస్తున్నారని.. సోయిలేకుండా రాక్షరాసులు.. రాబంధువులలాగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఏది మాట్లాడినా కేసీఆర్ లాగా అరుణమ్మ ఊరుకుంటుందని అనుకుంటువ్నానా’’ అంటూ విరుచుకుపడ్డారు.
ఎక్సైజ్ శాఖలో(Excise Department) బదిలీల్లో జరిగిన అక్రమాలపై ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) సీరియస్ అయ్యారు. బదిలీల సందర్భంలో కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission of India) ఆదేశాలను ఎందుకు పాటించలేదని ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్‌ను..
సివిల్ సర్వీస్ పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం నాడు విడుదల చేసింది. ఫలితాలను కమిషన్ వెబ్ సైట్లో చూడొచ్చు. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష గత ఏడాది మే 28వ తేదీన జరిగింది. అందులో మెయిన్స్‌కు క్వాలిఫై అయిన వారికి సెప్టెంబర్ 15, 16, 17, 23, 24వ తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం పరీక్ష నిర్వహించారు.