Telangana: ఎక్సైజ్ బదిలీల్లో అక్రమాలపై మంత్రి జూపల్లి సీరియస్
ABN , Publish Date - Apr 19 , 2024 | 08:38 AM
ఎక్సైజ్ శాఖలో(Excise Department) బదిలీల్లో జరిగిన అక్రమాలపై ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) సీరియస్ అయ్యారు. బదిలీల సందర్భంలో కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission of India) ఆదేశాలను ఎందుకు పాటించలేదని ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్‌ను..
హైదరాబాద్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): ఎక్సైజ్ శాఖలో(Excise Department) బదిలీల్లో జరిగిన అక్రమాలపై ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) సీరియస్ అయ్యారు. బదిలీల సందర్భంలో కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission of India) ఆదేశాలను ఎందుకు పాటించలేదని ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్‌ను ఆరా తీశారు. ఎందరు బదిలీ అయ్యారు, ఒక పార్లమెంటు నియోజకవర్గంలో మూడేళ్లకుపైగా పని చేస్తున్న ఎక్సైజ్ అధికారులను ఎందుకు బదిలీ చేయలేదని ప్రశ్నించారు. బదిలీలకు ఎందరు అర్హులు, ఎందరిని బదిలీ చేశారో.. పూర్తి వివరాలు పంపాలని ఆదేశించారు. ఎక్సైజ్ బదిలీల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించలేదని ‘ఫోరం ఫర్ డెమోక్రటిక్ తెలంగాణ’ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంధించిన వార్త గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైంది. దీంతో స్పందించిన మంత్రి జూపల్లి... కమిషనర్ నుంచి వివరాలు కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన బదిలీల వివరాలనూ పంపాలని చెప్పారు. ఎక్సైజ్ శాఖలో ఎలాంటి తప్పిదాలు జరగొద్దని, పొరపాటు చేస్తే ఎంతటివారైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవికూడా చదవండి:
టికెట్ ఇస్తే బీజేపీలోకి వచ్చేస్తా..