Home » Maharashtra
షిండే ముఖ్యమంత్రిగానే అసెంబ్లీ ఎన్నికలు వెళ్తున్నామని బీజేపీ అధిష్ఠానం ముందుగానే ప్రకటించినప్పటికీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. దేవేంద్ర ఫడ్నవిస్‌కు అసెంబ్లీ ఎన్నికల ప్రచార కీలక బాధ్యతలను బీజేపీ అప్పగించడం, అందుకు తగ్గట్టే ఆయన సమర్ధవంతంగా పార్టీని విజయపథంలో నిలపడంతో దేవేంద్ర ఫడ్నవిస్ చూపించిన చాణక్యం ఆ పార్టీ అధిష్ఠానం ప్రశంసలు అందుకుంటోంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి విజయం ఖరారైపోయిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ఎన్టీయేకు శుభాకాంక్షలు తెలిపారు.
విపక్ష 'మహా వికాస్ అఘాడి'ని కేవలం 50 సీట్లకు కట్టడి చేస్తూ బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి ఘనవిజయం దిశగా దూసుకుపోతుండటంతో పార్టీ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. మధ్యాహ్నం 1.30 గంటల సమయానికి ఈసీ తొలి ఫలితాలు ప్రకటించింది.
శనివారంనాడు వెలువడిన 'ఎర్లీ ట్రెండ్స్' ప్రకారం మహాయుతి కూటమి మెజారిటీ మార్క్‌ను దాటింది. మొత్తం 288 స్థానాల్లో 214 స్థానాల్లో ఆ కూటమి ఆధిక్యంతో ఉంది.
సర్వేతో తాను అంటే మరోసారి ఫ్రూవ్ చేసుకున్నారు కేకే. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి పక్కా అంచనాలు వేశారు. మహాయుతి కూటమి 225 సీట్లు గెలుస్తోందని లెక్క వేయగా.. దాదాపు అన్ని సీట్లలో కూటమి లీడ్‌లో ఉంది.
మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయం దాదాపు ఖరారు అయింది. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్డీయే తరఫున మహారాష్ట్రలో పలు అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం నిర్వహించారు. పవన్ ప్రచారం చేసిన స్థానాల్లో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. అభ్యర్థులందరూ విజయం దిశగా సాగుతున్నారు.
ప్రజా సంక్షేమానికి కృషి చేయడంతోనే ప్రజలు తమను ఈ ఎన్నికల్లో ఆదరించారని.. తమ విజయానికి ఇదే కారణమని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఉద్ధాటించారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ కూటమికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి విష్ చేశారు. తర్వాత సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ దేవేంద్ర ఫడ్నవీస్‌కు కూడా కాల్ చేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన ట్రెండ్స్‌లో ఎన్డీయే బంపర్ విజయం దిశగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్డీయే 220 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయితే రాష్ట్రానికి కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ కావచ్చని వార్తలు వస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి పట్టిన గతే తెలంగాణ కాంగ్రెస్‌కు పడుతుందని కేంద్ర మంత్రి, బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు.. తెలంగాణలో ఇచ్చిన ఒక్క హామీ కూడా కాంగ్రెస్ ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం ఇంకొకరికి ఇవ్వరని... వాళ్లలో వాళ్లే ప్రభుత్వాన్ని కూల్చుకుంటారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.