Share News

Maharashtra Assembly Elections: మహారాష్ట్రలో బీజేపీ కూటమికి భారీ మెజార్టీ..

ABN , Publish Date - Nov 23 , 2024 | 12:54 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ కూటమికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి విష్ చేశారు. తర్వాత సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ దేవేంద్ర ఫడ్నవీస్‌కు కూడా కాల్ చేశారు.

Maharashtra Assembly Elections: మహారాష్ట్రలో బీజేపీ కూటమికి భారీ మెజార్టీ..
CM Chandrababu

అమరావతి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమి దూసుకెళుతోంది. మెజార్టీ మార్క్ దాటి 200 పైచిలుకు స్థానాల్లో లీడ్‌లో ఉంది. దాంతో బీజేపీ కార్యాలయాల్లో సంబరాలు నెలకొన్నాయి. మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయంపై మిత్రపక్ష నేతలు స్పందిస్తున్నారు. ఘన విజయం సాధించిన బీజేపీ కూటమికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి విష్ చేశారు. తర్వాత సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ దేవేంద్ర ఫడ్నవీస్‌కు కూడా కాల్ చేశారు.

Updated Date - Nov 23 , 2024 | 12:54 PM