Share News

Maharashtra CM: మహారాష్ట్ర సీఎం పీఠం దక్కేదెవరికి?.. షిండే, ఫడ్నవిస్ మధ్యనే పోటీ

ABN , Publish Date - Nov 23 , 2024 | 04:56 PM

షిండే ముఖ్యమంత్రిగానే అసెంబ్లీ ఎన్నికలు వెళ్తున్నామని బీజేపీ అధిష్ఠానం ముందుగానే ప్రకటించినప్పటికీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. దేవేంద్ర ఫడ్నవిస్‌కు అసెంబ్లీ ఎన్నికల ప్రచార కీలక బాధ్యతలను బీజేపీ అప్పగించడం, అందుకు తగ్గట్టే ఆయన సమర్ధవంతంగా పార్టీని విజయపథంలో నిలపడంతో దేవేంద్ర ఫడ్నవిస్‌ చూపించిన చాణక్యం ఆ పార్టీ అధిష్ఠానం ప్రశంసలు అందుకుంటోంది.

Maharashtra CM: మహారాష్ట్ర సీఎం పీఠం దక్కేదెవరికి?.. షిండే, ఫడ్నవిస్ మధ్యనే పోటీ

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తేలిపోయాయి. బీజేపీ సారథ్యంలోని 'మహాయుతి' కూటమి.. కాంగ్రెస్ సారథ్యంలోని 'మహా వికాస్ అఘాడి'ని విజయానికి అతిదూరంగా పరిమితం చేసి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం ఎవరిని వరించనుందనే అంశంపైనే ప్రధానంగా అందరి దృష్టి ఉంది. షిండే ముఖ్యమంత్రిగానే అసెంబ్లీ ఎన్నికలు వెళ్తున్నామని బీజేపీ అధిష్ఠానం ముందుగానే ప్రకటించినప్పటికీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. దేవేంద్ర ఫడ్నవిస్‌కు అసెంబ్లీ ఎన్నికల ప్రచార కీలక బాధ్యతలను బీజేపీ అప్పగించడం, అందుకు తగ్గట్టే ఆయన సమర్ధవంతంగా పార్టీని విజయపథంలో నిలపడంతో దేవేంద్ర ఫడ్నవిస్‌ చూపించిన చాణక్యం ఆ పార్టీ అధిష్ఠానం ప్రశంసలు అందుకుంటోంది.

UP bypolls: బీజేపీ విజయంపై యోగి ఫస్ట్ రియాక్షన్


ఫడ్నవిస్ రియాక్షన్

మహాయూతి కూటమి తిరిగి అధికారంలోకి వస్తే సీఎం ఎవరనే ప్రశ్నకు ఎన్నికల ముందు నుంచి ఫడ్నవిస్ తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొడుతూ వచ్చారు. దీనిపై కేంద్ర మంత్రి అమిత్‌షా కూటమి నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, కూటమి నేతలందరితో సంప్రదించిన తర్వాతే సీఎం ఎంపిక ఉంటుందని చెప్పారని, దీనిపై ఎలాంటి వాదనలు, ప్రశ్నలకు తావులేదని అన్నారు. ఇదే విషయాన్ని కౌటింగ్‌కు కొద్ది గంటల ముందు కూడా ఫడ్నవిస్ పునరుద్ఘాటించారు. ''నిర్ణయం ఏదైనా అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. ఇందులో ఎలాంటి వివాదం లేదు'' అని చెప్పారు.


ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని 40 మంది శివసేన ఎమ్మెల్యేలు 2022లో అవిభక్త శివసేనపై తిరుగుబాటు చేసి ప్రత్యేక వర్గంగా ఏర్పాడ్డారు. బీజేపీకి తమ మద్దతు ప్రకటించారు. దీంతో ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని 'మహా వికాస్ అఘాడి' ప్రభుత్వం అధికారం కోల్పోయింది. దీంతో షిండే ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.


ఎవరికి అవకాశాలు మెండు?

షిండే, ఫడ్నవిస్ మధ్యే ప్రధానంగా ముఖ్యమంత్రి పీఠానికి పోటీ ఉన్నప్పటికీ ఫడ్నవిస్‌కే సీఎం పీఠం దక్కనుందనే అభిప్రాయం మెజారిటీ బీజేపీ నేతల్లో ఉంది. 288 అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీకి 145 సీట్లు అవసరం కాగా, బీజేపీ సొంతంగానే ఆ సంఖ్యకు చేరువైంది. దీంతో షిండే మద్దతు లేకుండానే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన సత్తా బీజేపీకి చేకూరింది. ఏక్‌నాథ్ షిండేకు ఈ విషయం తెలియదనలేం. ఈ పరిణామలకు బలం చేకూరుస్తూ కాబోయే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అంటూ ఫలితాలు వెలువడుతుండగానే పలు చోట్ల పోస్టర్లు వెలిసాయి.


ఇవి కూడా చదవండి..

Maharashtra elections 2024: మెజారిటీ మార్క్‌ను దాటిని 'మహాయుతి'

Pawan Kalyan: మహారాష్ట్రలోనూ పవన్ కల్యాణ్ హవా.. పవన్ ప్రచారం చేసిన స్థానాల్లో బీజేపీ దూకుడు..

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 23 , 2024 | 05:16 PM