Maharashtra Results: 'మహా' త్రయానికి అమిత్‌షా అభినందనలు
ABN , Publish Date - Nov 23 , 2024 | 02:42 PM
విపక్ష 'మహా వికాస్ అఘాడి'ని కేవలం 50 సీట్లకు కట్టడి చేస్తూ బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి ఘనవిజయం దిశగా దూసుకుపోతుండటంతో పార్టీ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. మధ్యాహ్నం 1.30 గంటల సమయానికి ఈసీ తొలి ఫలితాలు ప్రకటించింది.
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 'మహాయుతి' కూటమి మళ్లీ అధికారం నిలబెట్టుకోవడం ఖాయమైనట్టే. విజయానికి అవసరమైన మెజారిటీ మార్క్‌ను దాటి అనూహ్యమైన ఫలితాల దిశగా 'మహాయుతి కూటమి' దూసుకుపోతుండటంతో కూటమి అధినేతలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) అభినందనలు తెలిపారు. కూటమి ఘనవిజయానికి కృషి చేసిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు, దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్‌లకు ఫోనులో ఆయన అభినందనలు తెలిపారు.
CM Eknath Shinde: మహారాష్ట్రలో భారీ విజయంపై సీఎం ఏక్ నాథ్ షిండే ఏమన్నారంటే..
విపక్ష 'మహా వికాస్ అఘాడి'ని కేవలం 50 సీట్లకు కట్టడి చేస్తూ బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి ఘనవిజయం దిశగా దూసుకుపోతుండటంతో పార్టీ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. మధ్యాహ్నం 1.30 గంటల సమయానికి ఈసీ తొలి ఫలితాలు ప్రకటించింది. వడల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి కాలిదాస్ కొలాంబకర్ తన సమీప శివసేన (యూబీటీ) అభ్యర్థి శ్రద్ధాజాదవ్‌పై 24,973 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినట్టు ఈసీ ప్రకటించింది. ఈసీఐ లెక్కల ప్రకార, బీజేపీ అభ్యర్థులు 123 స్థానాల్లో, శివసేన 55, ఎన్‌సీపీ 38 సీట్లలో ఆధిక్యంతో ఉండగా, ఎంవీఏలో ఎన్‌సీపీ (శరద్‌చంద్ర పవార్) అభ్యర్థులు 13 సీట్లలో కాంగ్రెస్, శివసేన (యూబీటీ) అభ్యర్థులు చెరో 19 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. సీఎం ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మహారాష్ట్రలో మహాయుతి కూటమిలో భాగంగా 149 స్థానాల్లో బీజేపీ పోటీ చేయగా, 81 సీట్లలో శివసేన, 59 చోట్ల అజిత్ పవార్ ఎన్‌సీపీ పోటీ చేశాయి. ఎంవీఏలో భాగంగా కాంగ్రెస్ 101 స్థానాల్లో, శివసేన (యూబీటీ) 95 స్థానాల్లో, ఎన్‌సీపీ (ఎస్‌పీ) 86 చోట్ల పోటీ చేసింది.
ఇవి కూడా చదవండి..
Maharashtra elections 2024: మెజారిటీ మార్క్‌ను దాటిని 'మహాయుతి'
Pawan Kalyan: మహారాష్ట్రలోనూ పవన్ కల్యాణ్ హవా.. పవన్ ప్రచారం చేసిన స్థానాల్లో బీజేపీ దూకుడు..
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..