Share News

CM Eknath Shinde: మహారాష్ట్రలో భారీ విజయంపై సీఎం ఏక్ నాథ్ షిండే ఏమన్నారంటే..

ABN , Publish Date - Nov 23 , 2024 | 12:54 PM

ప్రజా సంక్షేమానికి కృషి చేయడంతోనే ప్రజలు తమను ఈ ఎన్నికల్లో ఆదరించారని.. తమ విజయానికి ఇదే కారణమని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఉద్ధాటించారు.

CM Eknath Shinde:  మహారాష్ట్రలో భారీ విజయంపై  సీఎం ఏక్ నాథ్ షిండే ఏమన్నారంటే..

ముంబై: మహారాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే (Eknath Shinde) ధన్యవాదాలు తెలిపారు. కూటమికి ఓట్లు వేసి గెలిపించిన రైతులు, యువతకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం చేపట్టి సంక్షేమ పథకాలే మహాయుతికి ప్రజలు బ్రహ్మరథం కట్టేందుకు కారణమైందని వివరించారు. కూటమి నేతలు ఈ రోజు సాయంత్రం సమావేశమై.. కొత్త ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చిస్తామని తెలిపారు. కూటమి విజయానికి సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్షగా నిలిచాయని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అభిప్రాయ పడ్డారు.


ఇది ట్రైలర్ మాత్రమే. ముందుంది సినిమా..

కాగా.. 'ఇది ట్రైలర్ మాత్రమే. ముందుంది సినిమా'' అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్నారు. ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ, అసలు సినిమా ముందుందంటూ అన్నారు. గతంలో తాను ఒక ఆపరేషన్ చేశానని, కుట్లు కూడా వేయకుండా ఆపరేషన్ జరిపానని ఆయన అప్పట్లో శివసేన నుంచి బయటకు వచ్చి 30కి పైగా ఎమ్మెల్యేలతో బీజేపీకి మద్దతిచ్చిన ఘట్టాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ అన్నారు. ''నేను డాక్టర్‌ను కాను. అయినా ఏడాదిన్నర క్రితం ఒక ఆపరేషన్ చేశాను. కుట్లు వేయకుండానే ఆపరేషన్ జరిగింది. అంతకంటే ఏమీ చెప్పలేను. ఇది ట్రయిలర్ మాత్రమే, ఫిల్మ్ ఇంకా రావాల్సి ఉంది'' అని సీఎం నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఈరోజు మిలింద్ ఎలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నారో ఏడాదిన్నర క్రితం తను కూడా అలాగే భావించానని, అప్పటి సీఎం ఉద్ధవ్ థాకరేతో తెగతెంపులు చేసుకున్నానని చెప్పారు.


లీడ్‌లో మహాయుతి కూటమి

ఓట్ల లెక్కింపు మొదలుపెట్టినప్పటి నుంచి మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చింది. ఉదయం 11 గంటల వరకు అందిన ఫలితాల ప్రకారం మహాయుతి కూటమి 220 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుంది. మహారాష్ట్ర ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించిన సంస్థల్లో కొన్ని గరిష్టంగా మహాయుతి కూటమికి 180 నుంచి 190 స్థానాలు గెలుస్తాయని చెప్పాయి. అయితే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో 160కి పైగా స్థానాల్లో టీడీపీ కూటమి విజయం సాధించింది. అదే సమయంలో జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో ఆ పార్టీ గెలిచిన విషయం తెలిసిందే.

Updated Date - Nov 23 , 2024 | 01:10 PM