Home » Maharashtra
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ త్వరలోనే వెలువడనుండటంతో విపక్ష 'మహా వికాస్ అఘాడి' కూటమి సీట్ల పంపకాలపై కీలక అడుగు పడింది.
దేశంలో కులగణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాహుల్ గాంధీ అన్నారు. ఇందువల్ల ప్రతి కులంలో ఎంతమంది జనాభా ఉన్నారనేది తెలియడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థపై వారికి ఏమేరకు నియంత్రణ ఉందనేది తెలుస్తుందని అన్నారు.
మహారాష్ట్ర ఎన్నికల తర్వాత షిండేకు మద్దతుగా నిలిచిన నాయకులంతా నిరుద్యోగులు కావడం ఖాయమని శనివారంనాడు శివసేన యూబీటీ పార్టీ నిర్వహించిన ఉద్యోగ మేళా కార్యక్రమంలో ఉద్ధవ్ మాట్లాడుతూ చెప్పారు.
ప్రజాస్వామ్యాన్ని, దేశంలోని వ్యవస్థలను బీజేపీ ప్రభుత్వం నీరుగారుస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆక్షేపించారు.
భూములున్న రైతులకు మూడు వాయిదాల్లో ఏటా రూ.6,000 ఇచ్చే పీఎం-కిసాన్ పథకాన్ని 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించారు. శనివారంనాడు 18వ ఇన్స్టాల్మెంట్ కింద ప్రధాని విడుదల చేసిన మొత్తంతో కలిసి ఇంతవరకూ రూ.3.45 లక్షల కోట్లకు పైగా పంపిణీ జరిగింది.
ప్రస్తుతం మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. వాశిమ్ జిల్లాలోని మాతా జగదంబ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ నవరాత్రులు పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, గుడిలోని సంప్రదాయిక ఢోల్ను వాయించారు.
మహారాష్ట్రలో షెడ్యూల్ తెగల (ఎస్టీ) క్యాటగిరీలో ధన్‌గఢ్ సామాజిక వర్గాన్ని చేర్చాలన్న డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్న నేపథ్యంలో.. అధికార వర్గం ప్రజాప్రతినిధుల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.
అక్టోబర్ 3న యువతిపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి సమయంలో నగరానికి చెందిన యువతి తన స్నేహితుడితో కలిసి బోప్‌దేవ్ ఘర్ ప్రాంతానికి వెళ్లింది.
ఆసుపత్రి నుంచి చక్రాల కుర్చీలో బయటకు వచ్చిన గోవిందా తాను కోలుకోవాలని ప్రార్థించిన మీడియాకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. నిలుచుని ఫోటోలు దిగారు.
మహారాష్ట్ర సచివాలయం మంత్రాలయం వద్ద శుక్రవారంనాడు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సచివాలం మూడో అంతస్తు నుంచి అధికార కూటమికి చెందిన ఎన్సీపీ ) ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ సహా పలువురు గిరిజన ఎమ్మెల్యేలు కిందకు దూకడం కలకలం రేపింది.