Share News

PM Modi: రూ.20,000 కోట్ల పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేసిన మోదీ

ABN , Publish Date - Oct 05 , 2024 | 02:45 PM

భూములున్న రైతులకు మూడు వాయిదాల్లో ఏటా రూ.6,000 ఇచ్చే పీఎం-కిసాన్ పథకాన్ని 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించారు. శనివారంనాడు 18వ ఇన్‌స్టాల్‌మెంట్ కింద ప్రధాని విడుదల చేసిన మొత్తంతో కలిసి ఇంతవరకూ రూ.3.45 లక్షల కోట్లకు పైగా పంపిణీ జరిగింది.

PM Modi: రూ.20,000 కోట్ల పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేసిన మోదీ

న్యూఢిల్లీ: అన్నదాతలకు వ్యవసాయ పెట్టుబడి సాయం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan Samman Nidhi) పథకం 18వ ఇన్‌స్టాల్‌మెంట్ కింద రూ.20,000 కోట్ల మొత్తాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారంనాడు విడుదల చేశారు. మహారాష్ట్రలోని వాశింలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని స్వయంగా పాల్గొని ఈ నిధులను విడుదల చేశారు. మధ్యవర్తల ప్రమేయం లేకుండా దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతులకు నేరుగా వారి అకౌంట్లలోనే ఈ మొత్తం జమ అవుతుంది.


పీఎం కిసాన్ నిధుల విడుదలకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానితో పాటు మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్, మంత్రి సంజయ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా 732 కృషి విజ్ఞాన్ కేంద్రాలు, లక్ష ప్రాథమిక వ్యవసాయ సహకారసంఘాలు, 5 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లతో సహా 2.5 కోట్ల మంత్రి రైతులు హాజరయ్యారు.

PM Modi: నవరాత్రి వేడుకలు.. మహారాష్ట్ర జగదాంబ ఆలయంలో డోలు వాయించిన మోదీ!


భూములున్న రైతులకు మూడు వాయిదాల్లో ఏటా రూ.6,000 ఇచ్చే పీఎం-కిసాన్ పథకాన్ని 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించారు. శనివారంనాడు 18వ ఇన్‌స్టాల్‌మెంట్ కింద ప్రధాని విడుదల చేసిన మొత్తంతో కలిసి ఇంతవరకూ రూ.3.45 లక్షల కోట్లకు పైగా పంపిణీ జరిగింది. మహారాష్ట్రలో 17 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లవో 1.20 కోట్ల రైతులకు రూ.32,000 కోట్లు జమ అయ్యాయి. 18వ ఇన్‌స్టాల్‌మెంట్‌గా 91.51 లక్షల రైతులు రూ.1,900 కోట్లకు పైగా ప్రయోజనం పొందనున్నారు. పీఎం కిసాన్ ఇన్‌స్టాల్‌మెంట్ పంపిణీతో పాటు రూ.2,000 కోట్లను నమో సేత్కారి మహాసన్మాన్ నిధి యోజన 5 ఇన్‌స్టాల్‌మెంట్‌ కింద మహారాష్ట్రకు ప్రధామంత్రి విడుదల చేశారు.


Read Latest and National News

ఈ వార్తలు కూడా చదవండి...

PM Internship: పీఎం ఇంటర్న్‌షిప్‌ పోర్టల్‌లో 2,200 వేకెన్సీలు

Haryana Elections: హరియాణాలో ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రముఖులు

Updated Date - Oct 05 , 2024 | 02:45 PM