Home » Mallareddy
మాజీ మంత్రి మల్లారెడ్డి వర్సెస్ 15 మంది మధ్య భూ వివాదం తారా స్థాయికి చేరింది. కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కలిసి స్థలంలో వేసిన బారికేడ్లను తొలగించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి(MallaReddy) ఏం చేసినా సంచలనమే. తెలంగాణ రాజకీయాల్లోనే(Telangana Politics) ఆయనొక స్పెషల్. రాజకీయ నేతలందు ఆయన వేరయా అన్నట్లు ఉంటుంది మల్లారెడ్డి శైలి. తాజాగా ఎన్నికల ప్రచారంలో(Election Campaign) పాల్గొన్న మల్లారెడ్డి.. నవ్వులు పూయించారు.
కాంగ్రె్‌సలో తమ పార్టీకి చెందిన కోవర్టులు ఉన్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆ కోవర్టులంతా బీఆర్ఎస్
మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తారని మాజీమంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. దాంతో మల్లారెడ్డి స్పందించక తప్పలేదు. అసలు ఏం జరిగిందో మీడియాకు వివరించారు. తాను ఏదో సరదాకి అన్నానని, దానిని సీరియస్‌గా తీసుకోవద్దని సూచించారు.
మాజీమంత్రులు ఈటల రాజేందర్, మల్లా రెడ్డి మధ్య ఆస్తికర సంభాషణ జరిగింది. ఈటల రాజేందర్ మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రచారంలో భాగంగా ఈటల రాజేందర్‌కు మల్లారెడ్డి ఎదురు పడ్డారు. గతంలో వీరిద్దరూ బీఆర్ఎస్ పార్టీలో కలిసి పనిచేశారు. ఈటల రాజేందర్ పార్టీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. లోక్ సభ ఎన్నిక, విజయం గురించి చర్చ వచ్చింది.
సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులకు రాష్ట్రాన్ని పరిపాలించడం చేతకావడం లేదని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Medical MLA Chamakura Mallareddy) అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మెట్రోరైల్లో ప్రయాణించి వినూత్న ప్రచారం చేశారు.
అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చాయి. ఒక పార్టీ పేకమేడలా కూలుతుంటే.. మరో పార్టీ మాత్రం అంతకంతకూ ఎదుగుతోంది. అవేంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నీలా గోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు.
హైదరాబాద్: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి విమర్ళలు గుప్పించారు. బుధవారం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... తామే గెలుస్తామని బీజేపీ, కాంగ్రెస్ నేతలు అంటున్నారని, వాళ్ళు చేసిందేమీ లేదని, ఓటు అడిగే హక్కు ఆ రెండు పార్టలకు లేదని అన్నారు.
మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Mallareddy) యూనివర్శిటీలో జరిగిన ఆందోళనలపై మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ (MLA Rohit) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తొడలు కొడితే హీరోయిజమా.. తాము చేస్తే రౌడీజయమా అని ప్రశ్నించారు. వాళ్లు చేస్తే రాజకీయం..తాము చేస్తే వ్యభిచారమా అని అన్నారు.
70వేల మంది విద్యార్థుల భవిష్యత్తును మల్లారెడ్డి యూనివర్సిటీలో తీర్చి దిద్దుతున్నామని మల్లారెడ్డి యునివర్సిటీ డెరైక్టర్ భద్ర రెడ్డి(Bhadra Reddy) అన్నారు. కళాశాల లోపలికి వచ్చి, రౌడీయిజం చేసి విద్యార్థుల జీవితాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు.