Mallareddy: అమెరికాలో మల్లారెడ్డి.. అసలు విషయమిదే..?
ABN , Publish Date - May 31 , 2024 | 07:40 PM
అత్యుత్తమ ప్రమాణాలతో తమ యూనివర్సిటీ విద్యను అందిస్తోందని మల్లారెడ్డి సంస్థల చైర్మన్ చామకూర మల్లారెడ్డి (Mallareddy) పేర్కొన్నారు. అమెరికా వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
హైదరాబాద్: అత్యుత్తమ ప్రమాణాలతో తమ యూనివర్సిటీ విద్యను అందిస్తోందని మల్లారెడ్డి సంస్థల చైర్మన్ చామకూర మల్లారెడ్డి (Mallareddy) పేర్కొన్నారు. అమెరికా వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న సెమినార్‌లో భారతదేశం తరఫున టాప్ 20 యూనివర్సిటీలు పాల్గొంటున్నాయని అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మీడియాతో మల్లారెడ్డి మాట్లాడుతూ... ఈ కాన్ఫరెన్స్‌లో భాగంగా మల్లారెడ్డి యూనివర్సిటీ తరఫున హాజరవ్వడం గర్వంగా ఉందని అన్నారు. విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలతో తమ యూనివర్సిటీ విద్యను అందిస్తోందని అన్నారు.
అమెరికా, జపాన్, చైనా, పోర్చుగల్ లాంటి దేశాలు ఈ సెమినార్‌లో పాల్గొన్నాయన్నారు. ప్రపంచంలోని పెద్ద యూనివర్సిటీలు అన్ని ఈ సెమినార్‌లో స్టాళ్లు పెట్టుకున్నాయని చెప్పారు. తెలంగాణ నుంచి తమ మూనివర్సిటీ స్టాళ్లను ఏర్పాటు చేశామని అన్నారు. ప్రపంచంలోని చాలా యూనివర్సిటీలతో కమ్యూనికేట్ అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ప్రపంచంలోని కొత్త కోర్సుల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందని.. వాటిని తమ యూనివర్సిటీకి తీసుకు రావడానికి కృషి చేస్తామని చెప్పారు.
తెలంగాణ ప్రజలు ఎక్కువ మంది అమెరికాలో ఉన్నారని తెలిపారు. ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా హెల్త్, అగ్రికల్చర్ కోర్సులను తమ యూనివర్సిటీలో పెడతామన్నారు. నిఫుణులైన విద్యార్థులను తయారు చేయడానికి దోహదం చేస్తామని చెప్పుకొచ్చారు. పోటీ ప్రపంచానికి ధీటుగా మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులను తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ సెమినార్‌కు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చని మల్లారెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ మంత్రులకు జూన్ ఫోర్త్ ఫీవర్..
చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు టీడీపీ ట్రైనింగ్..
ఆ మంత్రులకు జూన్ ఫోర్త్ ఫీవర్..
రాష్ట్ర చిహ్నం.. తాత్కాలికంగా నిలిపివేత..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News