Share News

Mallareddy: ‘నన్ను శానా ఇబ్బంది పెడ్తున్నరు’.. మల్లారెడ్డి భావోద్వేగం..

ABN , Publish Date - May 21 , 2024 | 11:37 AM

Mallareddy: ‘నన్ను శానా ఇబ్బంది పెడ్తున్నరు’ అంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి(Ex Minister Mallareddy) భావోద్వేగానికి గురయ్యారు. సికింద్రాబాద్(Secunderabad) పరిధిలోని సుచిత్రలో మల్లారెడ్డికి సంబంధించిన భూమి వివాదంలో(Suchitra Land Issue) ఉన్న ఈ విషయం తెలిసిందే. ఈ అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎమ్మెల్యే లక్ష్మణ్ పై(MLA Laxma Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు.

Mallareddy: ‘నన్ను శానా ఇబ్బంది పెడ్తున్నరు’.. మల్లారెడ్డి భావోద్వేగం..
Ex Minister Malla Reddy

హైదరాబాద్, మే 21: ‘నన్ను శానా ఇబ్బంది పెడ్తున్నరు’ అంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి(Ex Minister Mallareddy) భావోద్వేగానికి గురయ్యారు. సికింద్రాబాద్(Secunderabad) పరిధిలోని సుచిత్రలో మల్లారెడ్డికి సంబంధించిన భూమి వివాదంలో(Suchitra Land Issue) ఉన్న ఈ విషయం తెలిసిందే. ఈ అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎమ్మెల్యే లక్ష్మణ్ పై(MLA Laxma Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు. తతను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

తప్పుడు పత్రాలతో, ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లను చూపుతూ తన భూమిని విప్ లక్ష్మణ్ కుమార్ కబ్జా చేసే ప్రయత్నం చేశారని మాజీ మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. తన దగ్గర పక్కా డాక్యుమెంట్లు ఉన్నాయని ఆధారాలతో మల్లారెడ్డి ముందుకు వచ్చారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కన్ఫామ్ అయిందని, ఈ వ్యవహారం అంతా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని మల్లారెడ్డి చెప్పారు.


సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్‌ 82లో ఉన్న రెండున్నరెకరాల విషయంలో మాజీ మంత్రి మల్లారెడ్డి.. మరో 15 మంది మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆ భూమి తమదేనని మల్లారెడ్డి అంటుంటే.. అందులో 1.11 ఎకరాల భూమి తమదేనని, తలా 400 గజాలు కొన్నామని 15 మంది వ్యక్తులు వాదిస్తున్నారు. ఈ విషయంలో కోర్టు తీర్పు కూడా తమకే అనుకూలంగా ఉందంటున్నారు. ఈ 15 మంది జాబితాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణ్ కూడా ఉన్నారు.

2015 82/e సర్వే నెంబర్లో వేరే వ్యక్తి దగ్గరి నుంచి తాను రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని.. మరో మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారని లక్ష్మణ్ తెలిపారు. ఎలాంటి వివాదాలు లేవని తెలిసిన తర్వాతే తాము భూమి కొనుగోలు చేశామన్నారు. 15 మంది వ్యక్తుల్లో నేను ​కూడా ఒకడినని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుచిత్ర సెంటర్‌లో భూమి వివాదం తలెత్తింది. ప్రస్తుతం దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. మరి వారు ఏం తేలుస్తారనేది చూడాలి.

For More Telangana News and Telugu News..

Updated Date - May 21 , 2024 | 12:36 PM