Students Protest: ఆహారంలో పురుగులపై మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థులు మరోసారి ఆందోళన..
ABN , Publish Date - Jun 07 , 2024 | 07:50 AM
మైసమ్మగూడ ప్రాంతంలోని మల్లారెడ్డి యూనివర్సిటీ (Mallareddy University)లో విద్యార్థులు మరోసారి ఆందోళన (Students Protest)కు దిగారు. అన్నంలో పురుగులు వస్తున్నాయంటూ యూనివర్శిటీ ఎదుట బైఠాయించి "మల్లారెడ్డి డౌన్ డౌన్" అంటూ నినాదాలు చేశారు. ఎన్నిసార్లు చెప్పినా తమ సమస్యను యాజమాన్యం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
మేడ్చల్: మైసమ్మగూడ ప్రాంతంలోని మల్లారెడ్డి యూనివర్సిటీ (Mallareddy University)లో విద్యార్థులు మరోసారి ఆందోళన (Students Protest)కు దిగారు. అన్నంలో పురుగులు వస్తున్నాయంటూ యూనివర్శిటీ ఎదుట బైఠాయించి "మల్లారెడ్డి డౌన్ డౌన్" అంటూ నినాదాలు చేశారు. ఎన్నిసార్లు చెప్పినా తమ సమస్యను యాజమాన్యం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థులతో కలిసి NSUI నాయకులూ ధర్నాలో పాల్గొన్నారు. లక్షల్లో ఫీజులు కట్టించుకొని పురుగుల ఆహారాన్ని పెడుతూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారంటూ NSUI నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ఫీజులు, భోజనంలో పురుగులు వస్తున్నాయంటూ గతంలోనూ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు యూనివర్శిటీ ఎదుట పలుమార్లు ధర్నాలు, ఆందోళనలు చేశారు. ఆ సమయంలో కళాశాల ఫర్నిచర్ ధ్వంసం చేసి మల్లారెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అయినప్పటికీ వారు పట్టించుకోవడం లేదని, ఫీజులపై ఉన్న శ్రద్ధ విద్యార్థులకు వసతులు కల్పించడంలో లేదంటూ మండిపడ్డారు. ఎన్నిసార్లు నిరసనలు తెలిపినా యాజమాన్యంలో మార్పు రాకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి:
Viral news: దక్షిణ కజకిస్థాన్‌లో బయటపడిన నిధి.. అందులో ఏం ఉందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!