Home » Mallikarjun Kharge
లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు నిర్వహిస్తోంది. నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించనుంది. సాయంత్రం 6 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో సీఈసీ భేటీ కానుంది.
కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ పదవీ నుంచి హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన సుధీర్ శర్మను తొలగించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాలతో శర్మను పదవీ నుంచి తొలగించామని జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటనలో తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లో గల ధర్మశాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సుధీర్ శర్మ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో మంత్రిగా కూడా విధులు నిర్వహించారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నేత జైరామ్ రమేష్ కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి లీగల్ నోటీసు పంపారు. తన ఇంటర్వ్యూను వక్రీకరిస్తూ 19 సెకన్ల వీడియోను 'ఎక్స్'లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పోస్ట్ చేసినందుకు ఈ లీగల్ నోటీసులు ఇచ్చారు. మూడు రోజుల్లోగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏపీలో ‘‘ఇందిరమ్మ అభయం’’ పేరుతో మొదటి గ్యారెంటీను AICC అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) ప్రకటించారు. ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ. 5 వేలు ఇచ్చేలా గ్యారెంటీని తీసుకొచ్చినట్లు తెలిపారు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.5 వేలు ఇస్తామన్నారు. సోమవారం నాడు అనంతపురం పట్టణంలో ఏపీ పీసీసీ ‘‘న్యాయ సాధన’’ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించింది.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu)కు లేఖ రాశారు. అగ్నిపథ్ పథకం కారణంగా సాయుధ దళాలలో యువతకు అన్యాయం జరుగుతోందని వారి ఉపాధి పోతోందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
బీజేపీ ఇచ్చిన మోదీ గ్యారెంటీ హామీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుప్పించారు. ఇది దేశాన్ని నియంతృత్వం వైపు ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు
కలబురగి లోక్‌సభ స్థానం నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge) పోటీ చేయాలని జిల్లా ఎమ్మెల్యేలు తీర్మానించారు.
పండించే పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలంటూ రైతుల చిరకాల డిమాండ్‌పై కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపిస్తే రైతులు పండించే వివిధ పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చేలా ఒక చట్టాన్ని తీసుకువస్తామని ప్రకటించింది.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రవర్తన తనను తీవ్రంగా బాధించిందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ అన్నారు. తన కుమారుడి మరణం కంటే ఎక్కవ బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్(Congress) పాలనలో దేశ ఆర్థిక పరిస్థితిని, ప్రస్తుత ఎన్డీఏ సర్కార్‌తో పోల్చుతూ బీజేపీ(BJP) శ్వేత పత్రం(White Paper) విడుదల చేయడానికి సిద్ధమయింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే క్రోడీకరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.