Share News

Kharge: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా.. ఖర్గే సమాధానం ఏంటంటే..

ABN , Publish Date - Mar 13 , 2024 | 01:15 PM

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కీలక సంకేతాలు ఇచ్చారు. 2024 లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అనే ప్రశ్నకు ఆయన నుంచి లేదనే సమాధానం వచ్చినట్లు తెలుస్తోంది.

Kharge: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా.. ఖర్గే సమాధానం ఏంటంటే..

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కీలక సంకేతాలు ఇచ్చారు. 2024 లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అనే ప్రశ్నకు ఆయన నుంచి లేదనే సమాధానం వచ్చినట్లు తెలుస్తోంది. 2009-2014 సమయంలో కర్ణాటకలోని గుల్బర్గా నుంచి ఎంపీగా ఉన్న ఖర్గే 2019లో సీటు కోల్పోయారు. అప్పటి నుంచి రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే వచ్చే లోక్‌సభ ( Lok Sabha ) ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారన్న వ్యాఖ్యలను కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఖండించారు. దిల్లీలో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే వయస్సు కారణంగా ఖర్గే ఈసారి ఎన్నికల బరిలోకి దిగకపోవచ్చని చెప్పినట్లు సమాచారం.

కాంగ్రెస్ హామీలనే బీజేపీ కాపీ కొడుతోందని ఖర్గే విమర్శించారు. కర్ణాటకలో ప్రారంభిన గ్యారంటీలను చూసి బీజేపీ మోదీ గ్యారెంటీ స్కీమ్ ను తీసుకువచ్చిందని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే కనీస మద్దతు ధర కోసం ముసాయిదా నిబంధనలను రూపొందించే ప్రక్రియను ప్రారంభించిందని ఖర్గే చెప్పారు. అంతే కాకుండా ఎమ్ఎస్పీని తాము చట్టబద్ధం చేస్తామని స్పష్టం చేశారు.


కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి చట్టబద్ధమైన హామీ సహా తమ డిమాండ్‌లను ఆమోదించాలంటూ వివిధ రాష్ట్రాల్లో అన్నదాతలు నిరసనలు చేస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్‌కు చెందిన రైతులు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఫిబ్రవరి 13 నుంచి ప్రారంభమైన ఆందోళనలు నేటికీ కొనసాగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీ వైపు వెళ్లకుండా ఉండేందుకు భద్రతా బలగాలు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశాయి.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 13 , 2024 | 01:15 PM