Kharge: రాజ్యాంగాన్ని రక్షించేందుకు ఇదే చివరి అవకాశం.. ఖర్గే ఘాటు వ్యాఖ్యలు..
ABN , Publish Date - Mar 16 , 2024 | 08:27 PM
లోక్ సభ ఎన్నికలకు ఎలక్షన్ షెడ్యూల్ కావడంతో ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్ష కాంగ్రెస్ ( Congress ) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధికార బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు.
లోక్ సభ ఎన్నికలకు ఎలక్షన్ షెడ్యూల్ కావడంతో ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్ష కాంగ్రెస్ ( Congress ) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధికార బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నియంతృత్వం నుంచి రక్షించేందుకు ఇదే చివరి అవకాశం అని ఆయన అన్నారు. ద్వేషం, దోపిడీ, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, దురాగతాలకు వ్యతిరేకంగా భారత ప్రజలు కలిసి పోరాడతారని పిలుపునిచ్చారు.
మరోవైపు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' మార్చి 17, 2024న ముగుస్తుంది. రేపు ఆదివారం ముంబయిలో కాంగ్రెస్ భారీ ర్యాలీని నిర్వహిస్తోంది, ఇందులో మిత్రపక్షమైన 'ఇండియా అలయన్స్' నేతలు సైతం కూడా పాల్గొంటారు. అయితే ఈ ర్యాలీ నిర్వహణకు ముందే లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించడంతో ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ఈ ర్యాలీపై అంతటా ఉత్కంఠ నెలకొంది.
కాగా.. దేశంలోని 543 లోక్‌సభ స్థానాల తేదీలను ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ ఎన్నికలు ఏప్రిల్ 19న జరగనుండగా, చివరి దశ ఎన్నికలు జూన్ 1న జరుగుతాయి. అన్ని స్థానాల ఎన్నికల ఫలితాలు జూన్ 4న రానున్నాయి.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.