Home » Mallikarjun Kharge
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రవర్తన తనను తీవ్రంగా బాధించిందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ అన్నారు. తన కుమారుడి మరణం కంటే ఎక్కవ బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్(Congress) పాలనలో దేశ ఆర్థిక పరిస్థితిని, ప్రస్తుత ఎన్డీఏ సర్కార్‌తో పోల్చుతూ బీజేపీ(BJP) శ్వేత పత్రం(White Paper) విడుదల చేయడానికి సిద్ధమయింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే క్రోడీకరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
బీజేపీకి 400 సీట్లకు పైనే రావచ్చంటూ కాంగ్రెస్ రాజ్యసభ నేత మల్లికార్జున్ ఖర్గే తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెద్దల సభలోనే ఛలోక్తులు విసిరారు. ఖర్గే ఇంత స్వేచ్ఛగా సభలో ఎక్కువ సేపు మాట్లాడటం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. ఫోర్లు, సిక్సర్లు కొట్టారని చెప్పారు.
కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారంనాడు పార్లమెంటులో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. బడ్జెట్‌పై జరుగుతున్న చర్చలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బీజేపీని పరోక్షంగా ప్రస్తావిస్తూ 'అబ్ కీ బార్, 400 పార్' అంటూ వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా అధికార పార్టీ సభ్యుల్లో నవ్వులు వెల్లివిరిసాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం చిరునవ్వులు చిందించారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇటీవల ‘ఇండియా’ కూటమి నుంచి వైదొలగడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేతలకు కేంద్ర దర్యాప్తు సంస్థలు నోటీసులు అందిస్తున్న నేపథ్యంలోనే ఆయన భయంతో కూటమి నుంచి వాకౌట్ చేశారని విమర్శించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనను తాను విష్ణుమూర్తి 11వ అవతారంగా అనుకుంటున్నారని, మతాన్ని రాజకీయాలతో ముడిపెడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నిశిత విమర్శలు చేశారు. ప్రజలు ఉదయం లేవగానే దేవీదేవతలు, గురువుల ముఖాలు చూడడానికి బదులు తన ముఖమే చూడాలని ప్రధాని కోరుకుంటున్నారని అన్నారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజీనామాపై(Nitish Kumar Resign) కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge) ఘాటుగా స్పందించారు. కలబురిగిలో ఆయన ఆదివారం మాట్లాడుతూ.. దేశంలో ఆయా రామ్, గయా రామ్‌లాంటి రాజకీయ నేతలు ఎక్కువైపోయారని పరోక్షంగా నితీశ్‌ని ఉద్దేశించి అన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర రెండు రోజుల విరామం తర్వాత ఈరోజు పునఃప్రారంభం కానుంది. పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురి జిల్లా నుంచి తిరిగి ప్రారంభమవుతుంది.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ( PM Modi ) ఇచ్చిన అన్ని హామీలపై ప్రశ్నిస్తామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) వ్యాఖ్యానించారు. గతంలో మోదీ గ్యారంటీ అని పత్రికలలో ప్రకటనలు ఇచ్చారు.. మరి రెండు కోట్ల ఉద్యోగాల గ్యారంటీ ఏమైంది. నల్లధనం వెనక్కు తెప్పిస్తాం అన్నాడు ఏమైందని ప్రశ్నించారు.
భారత్ జోడో న్యాయ్ యాత్ర అసోం పర్యటనలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ఎదరవుతున్న భద్రతా లోపాలపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. యాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగిన చొరవ తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ఖర్గే కోరారు.