Share News

Jagdeep Dhankar: కాంగ్రెస్ నేతల తీరు నన్ను చాలా బాధించింది.. ఉపరాష్ట్రపతి ఆవేదన

ABN , Publish Date - Feb 11 , 2024 | 09:05 AM

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రవర్తన తనను తీవ్రంగా బాధించిందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్‌ అన్నారు. తన కుమారుడి మరణం కంటే ఎక్కవ బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Jagdeep Dhankar: కాంగ్రెస్ నేతల తీరు నన్ను చాలా బాధించింది.. ఉపరాష్ట్రపతి ఆవేదన

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రవర్తన తనను తీవ్రంగా బాధించిందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్‌ అన్నారు. తన కుమారుడి మరణం కంటే ఎక్కవ బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్‌కు భారతరత్న అవార్డు ప్రకటించడంపై చర్చ సందర్భంగా శనివారం ఉదయం రాజ్యసభలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్‌ఎల్‌డీకి చెందిన జయంత్‌సింగ్‌కు అనుమతి ఇవ్వడాన్ని తప్పుబడుతూ కాంగ్రెస్‌ ఎంపీలు ఉపరాష్ట్రపతిని ప్రశ్నించారు. ఈ క్రమంలో రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌, ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గేల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ చర్చలో ప్రతిపక్ష నేతకంటే ముందుగా చౌదరి చరణ్‌ సింగ్ మనవడు, ఆర్‌ఎల్డీ అధినేత జయంత్‌ చౌదరికి మాట్లాడే అవకాశం ఇవ్వడాన్ని కాంగ్రెస్‌ తప్పుబట్టింది. ఏ రూల్‌ ప్రకారం జయంత్‌కు ముందుగా మాట్లాడే అవకాశం ఇచ్చారని ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ పరిస్థితులతో ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్ అసహనానికి లోనయ్యారు. చౌదరి చరణ్‌సింగ్‌ను, ఆయన వారసత్వాన్ని అవమానిస్తున్నారంటూ మల్లికార్జున్‌ ఖర్గే, జైరామ్‌ రమేశ్, ఇతర కాంగ్రెస్‌ సభ్యులపై ఆయన మండిపడ్డారు.


గతంలోనే చరణ్‌సింగ్‌ సింగ్‌కు భారతరత్న ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం దొరకలేదు. రైతుల అభ్యున్నతి కోసం చరణ్‌సింగ్‌ ఎన్నో చర్యలు తీసుకున్నారు. అలాంటి వ్యక్తి గురంచి చర్చ జరుగుతుంటే అడ్డుకోవడం అవివేకం. తద్వారా దేశ రైతాంగాన్నే మీరు అవమానిస్తున్నారు. చరణ్‌సింగ్‌ను అవమానిస్తే సహించను. దేశ సమగ్రత కోసం, సంక్షేమం కోసం కృషి చేసిన మహనీయుడు చరణ్ సింగ్.

- జగదీప్ ధన్‌ఖర్‌, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 11 , 2024 | 09:05 AM