Share News

Rahul Gandhi: రెండు రోజుల విరామం తర్వాత భారత్ జోడో న్యాయ్ యాత్ర నేడు బెంగాల్లో మళ్లీ షురూ

ABN , Publish Date - Jan 28 , 2024 | 12:16 PM

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర రెండు రోజుల విరామం తర్వాత ఈరోజు పునఃప్రారంభం కానుంది. పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయిగురి జిల్లా నుంచి తిరిగి ప్రారంభమవుతుంది.

Rahul Gandhi: రెండు రోజుల విరామం తర్వాత భారత్ జోడో న్యాయ్ యాత్ర నేడు బెంగాల్లో మళ్లీ షురూ

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ(rahul gandhi) నేతృత్వంలో చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర రెండు రోజుల విరామం తర్వాత ఈరోజు పునఃప్రారంభం కానుంది. పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయిగురి జిల్లా నుంచి తిరిగి ప్రారంభమవుతుంది. సిలిగురిలో రాహుల్ గాంధీ థానా మోర్ నుంచి ఎయిర్ వ్యూ మోర్ వరకు కవాతు నిర్వహించి అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తారు. అయితే ఈ బహిరంగ సభకు ఎలాంటి పరిపాలనా అనుమతి లేకపోవడం విశేషం. ఇలాంటి క్రమంలో ఏదైనా గందరగోళం చోటుచేసుకుంటుందా అని అక్కడి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Bihar Politics: బిహార్‌ అసెంబ్లీలో పార్టీల బలాబలాలు.. భవిష్యత్తు రాజకీయాలు ఇవే

ఇప్పటికే భారత్ జోడో న్యాయ యాత్రకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లేఖ చేశారు. రాష్ట్రంలో యాత్ర సజావుగా జరిగేలా చూడాలని కోరారు. ఈ క్రమంలోనే జల్‌పైగురిలో రాహుల్ గాంధీ ఫోటో ఉన్న కొన్ని బ్యానర్‌లను ధ్వంసం చేశారని కాంగ్రెస్ గతంలో ఆరోపించింది.

ఈ భారత్ జోడో న్యాయ యాత్ర జనవరి 14న మణిపూర్ నుంచి ప్రారంభమైంది. నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం మీదుగా యాత్ర గురువారం ఉదయం పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశించింది. అయితే బెంగాల్ చేరుకున్న తర్వాత భారత్ జోడో న్యాయ్ యాత్రకు విరామం ఇచ్చిన రాహుల్ న్యూఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు.

ఈ నేపథ్యంలోనే ఈరోజు మధ్యాహ్నం 2:00 గంటలకు జల్‌పైగురి PWD మలుపు నుంచి ఈ యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. జల్‌పైగురిలోని వివిధ ప్రాంతాల మీదుగా సిలిగురికి చేరుకుంటుంది. ఆ తర్వాత తన ట్రావెల్ బస్సులో ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని సోనాపూర్‌కు వెళ్లనున్నారు. ఈ రాత్రి అక్కడ శిబిరంలో విశ్రాంతి తీసుకోనున్నారు.

Updated Date - Jan 28 , 2024 | 12:16 PM