Home » Mallikarjun Kharge
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆది, సోమవారాల్లో ఆయన హస్తినలో ఉండనున్నారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి రేంవత్ రెడ్డి ఢిల్లీ చేరుకుంటారు.
జమ్మూకశ్మీర్లోని దోడా జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు భారత ఆర్మీ సైనికులు అశువులు బాయడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. పదేపదే భద్రతా లోపాలు తలెత్తడానికి కేంద్ర బాధ్యత వహించాలని అన్నారు. దేశానికి, వీరసైనికులకు కీడు తలబెడుతున్న దుండగులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా నిరుద్యోగం సమస్య పెరిగిపోతున్న వేళ కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) ప్రధాని మోదీకి సూటి ప్రశ్న వేశారు. 4 ఏళ్లలో 8 కోట్ల ఉద్యోగాలు ఇచ్చామని మోదీ చెప్పారని.. అదంతా ఫేక్ అంటూ ఖర్గే ధ్వజమెత్తారు.
ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 'ఇండియా' కూటమి 10 స్థానాల్లో విజయకేతనం ఎగురవేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఏడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో బీజేపీ అల్లిన భయం, గందరగోళం బద్దలయ్యాయని అన్నారు.
దేశ ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించిన జూన్ 25వ తేదీని ‘రాజ్యాంగ హత్యా దినం’గా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
దేశంలో ఎమర్జెన్సీ విధించిన 1975 జూన 25ను ‘సంవిధాన్ హత్యా దివస్’ (రాజ్యాంగ హత్యా దినం)గా పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంపై శుక్రవారం కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన తెలిపింది.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదులు తెలిపే తీర్మానంపై మోదీ మాట్లాడుతుండగా ప్రతిపక్ష నాయకుడు ఖర్గేని మాట్లాడాలనివ్వాలని విపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేయడం, చివరకు వారు సభ నుంచి వాకౌట్ చేయడంపై ఎన్సీపీ-ఎస్సీపీ చీప్ శరద్ పవార్ (Sharad Pawar)స్పందించారు. మల్లికార్జున్ ఖర్గే ప్రతిపక్ష నేతగా రాజ్యాంగ పదవిలో ఉన్నందున ఆయనను ప్రధానమంత్రి మోదీ, రాజ్యసభ చైర్మన్ గౌరవించాల్సి ఉంటుందని అన్నారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని రాజ్యసభ బుధవారం ఆమోదించింది. ఈ తీర్మానంపై ప్రధాని మోదీ మాట్లాడుతుండగా.. ప్రతిపక్ష నాయకుడు ఖర్గేను మాట్లాడనివ్వాలంటూ ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి.
మణిపూర్ అల్లర్లపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యసభలో స్పందించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి కేంద్రప్రభుత్వం తరపున ఆయన సమాధానమిచ్చారు.
పదేళ్ల పాలనలో రైతుల కోసం ఎన్నో పనులు చేశామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ కేంద్రప్రభుత్వం తరపున ప్రధాని మంత్రి నరేంద్రమోదీ మాట్లాడారు.