Rajyasabha: జగదీష్ ధన్ కడ్ వర్సెస్ మల్లికార్జున ఖర్గే
ABN , Publish Date - Jul 23 , 2024 | 03:09 PM
రాజ్యసభలో చైర్మన్ జగదీష్ ధన్కడ్, విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సమావేశాల్లో భాగంగా ఖర్గే మాట్లాడుతుండగా చైర్మన్ స్థానంలో కూర్చొన్న జగదీష్ కల్పించుకున్నారు. మీ పుట్టిన రోజున ఆశీర్వాదం తీసుకున్నాను. నిన్న సభా సజావుగా జరిగిందని జగదీష్ గుర్తుచేశారు. ఆ తర్వాత ఖర్గే మాట్లాడుతూ.. సభలో సభ నాయకుడికి ఎలాంటి గౌరవం ఇస్తారో.. అదేవిధంగా ప్రతిపక్ష నేతకు గౌరవం దక్కాలని అభిప్రాయ పడ్డారు. సభలో అలా జరగడం లేదన్నారు.
ఢిల్లీ: రాజ్యసభలో చైర్మన్ జగదీష్ ధన్కడ్ (Jagadish Dhankhar), విపక్ష నేత మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సమావేశాల్లో భాగంగా ఖర్గే మాట్లాడుతుండగా చైర్మన్ స్థానంలో కూర్చొన్న జగదీష్ కల్పించుకున్నారు. మీ పుట్టిన రోజున ఆశీర్వాదం తీసుకున్నాను. నిన్న సభా సజావుగా జరిగిందని జగదీష్ గుర్తుచేశారు. ఆ తర్వాత ఖర్గే మాట్లాడుతూ.. సభలో సభ నాయకుడికి ఎలాంటి గౌరవం ఇస్తారో.. అదేవిధంగా ప్రతిపక్ష నేతకు గౌరవం దక్కాలని అభిప్రాయ పడ్డారు. సభలో అలా జరగడం లేదన్నారు. ఆరెస్సెస్, నెహ్రూ గురించి ఖర్గే మాట్లాడగా సభలో గందరగోళం నెలకొంది. సభ్యుల అరుపులతో స్పీకర్ కలుగజేసుకున్నారు. ఖర్గే మైక్ కట్ చేశారు.