Mallikarjun Kharge: ఎస్సీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్ వద్దు
ABN , Publish Date - Aug 11 , 2024 | 04:34 AM
ఎస్సీ రిజర్వేషన్ అమలులో క్రీమీలేయర్‌ను పాటించాలన్న సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోవాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది.
దీనిపై పార్లమెంటులో చట్టం చేయండి
కేంద్రానికి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే డిమాండ్
ఎస్సీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్ వద్దు
న్యూఢిల్లీ, ఆగస్టు 10 : ఎస్సీ రిజర్వేషన్ అమలులో క్రీమీలేయర్‌ను పాటించాలన్న సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోవాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. క్రీమీలేయర్ ఆధారంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను నిరాకరించే భావనను ఖండించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు.
సుప్రీంకోర్టు తీర్పులో క్రీమీలేయర్ ప్రస్తావన ఉన్న భాగాలను తొలగిస్తూ పార్లమెంటులో చట్టం తీసుకురావాలని కోరారు. ఎస్సీ, ఎస్టీలకు క్రీమీలేయర్ వల్ల కలిగే ఇబ్బంది గురించి న్యాయమూర్తులు దృష్టి పెట్టనట్టు ఉందని ఆయన వ్యాఖ్యానించారు.