Budget 2024: మా మేనిఫెస్టోను కాపీ కొట్టారు... కాంగ్రెస్ స్ట్రాంగ్ రియాక్షన్
ABN , Publish Date - Jul 23 , 2024 | 04:11 PM
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోకసభలో ప్రవేశపెట్టిన 2024-25 వార్షిక బడ్జెట్ పై కాంగ్రెస్ పార్టీ పెదవి విరిచింది. ఇది 'కాపీ-పేస్ట్' బడ్జెట్ అని అభివర్ణించింది.
Union Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోకసభలో ప్రవేశపెట్టిన 2024-25 వార్షిక బడ్జెట్ (Union Budget 2024)పై కాంగ్రెస్ పార్టీ పెదవి విరిచింది. ఇది 'కాపీ-పేస్ట్' (copy-paste) బడ్జెట్ అని అభివర్ణించింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోని (Congress Nyay Patra 2024) అంశాలని బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం కాపీ కొట్టిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ సీనియర్ నేతలు శశిథరూర్, పి.చిదంబరం అన్నారు. తమ మేనిఫెస్టో నుంచి నిర్మలా సీతారామన్ 'అప్రంటీస్ స్కీమ్'ను కాపీ కొట్టారని మల్లికార్జున్ ఖర్గే తెలిపారు.
బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ 'ఇంటెర్న్‌షిప్ స్కీమ్'ను ప్రకటించారు. ఈ స్కీమ్ కింద ఫార్మల్ సెక్టార్‌లో ఫస్ట్‌టైమ్ ఉద్యోగులకు ఒక నెల వేతనం లభిస్తుంది. ఉద్యోగాన్వేషణలో ఉన్న వారు 500 టాప్-కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేయవచ్చు.
Budget 2024: యువతకు ఇబ్బడిముబ్బడిగా అవకాశాలు.. బడ్జెట్‌పై మోదీ
'ఈఎల్ఐ' మా హామీనే: చిదంబరం
లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టే-2024ను ఆర్థిక మంత్రి చదివారని, అందుకు ఆమెను అభినందిస్తున్నానని పి.చిదంబరం సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 30వ పేజీలో పేర్కొన్న ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెన్టివ్ (ELI)ను నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో చేర్చడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో పేజ్-11లో చెప్పిన 'ఎంప్రటీస్ స్కీమ్'ను కూడా ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో ప్రవేశపెట్టారని చెప్పారు. కాంగ్రెస్ మరికొన్ని ఐడియాలను కూడా బడ్జె్ట్‌లో చేర్చారని ఆయన తెలిపారు. అయితే బడ్జెట్‌లో 'ఏంజెల్ టాక్స్'ను నిర్మలా సీతారామన్ రద్దు చేయడాన్ని ఆయన అభినందించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏళ్లుగా 'ఏంజెల్ టాక్స్'ను రద్దు చేయాలని కోరుతోందని, కాంగ్రెస్ మేనిఫెస్టో 31వ పేజీలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఇదని చెప్పారు.
ఎంఎన్ఆర్‌ఈజీఏ ప్రస్తావన ఏదీ?: శశిథరూర్
కాగా, సామాన్య ప్రజానీకం సమస్యలపై బడ్జెట్‌లో పరిష్కారం కనిపించలేదని శశిథరూర్ పేర్కొన్నారు. ఎంఎన్‌ఆర్ఈజీఏ ఊసే లేదన్నారు. ఆదాయ అసమానతల పరిష్కారానికి బడ్జెట్‌లో చేసింది కూడా చాలా తక్కువ అని అన్నారు. ఏంజెల్ ఇన్వెస్టర్లపై పన్ను రద్దు చేయడాన్ని మాత్రం తాము స్వాగతిస్తున్నట్టు చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..