Home » Mallikarjun Kharge
ఎన్డీయే సర్కార్ మూడో సారి అధికారం చేపట్టిన తరువాత సోమవారం తొలి పార్లమెంటు సమావేశాలు(Parliament Sessions) ప్రారంభమయ్యాయి. బీజేపీ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్‌తో సహా ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగారు.
నీట్’ కుంభకోణాని’కి మోదీ ప్రభుత్వానిదే బాధ్యత అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. బీజేపీ వల్ల కుళ్లిపోయిన విద్యా వ్యవస్థ.. అధికారులను మార్చినంత మాత్రాన బాగుపడదని శనివారం ‘ఎక్స్’ పోస్టులో వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్రభుత్వం పేపర్ లీక్ చట్టాన్ని అమల్లోకి తేవడం కంటితుడుపు చర్య అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
ఉక్రెయిన్-రష్యా, ఇజ్రాయెల్-గాజా యుద్ధాలను ఆపినట్లుగా చెప్పుకొనే మోదీ.. పేపర్ లీక్‌ను అడ్డుకోలేకపోయారా? అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
యూజీసీ-నెట్ పరీక్షలను రద్దు(UGC-NET Exams Cancelled) చేయడంతో మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ విరుచుకుపడింది. ఎన్డీయే సర్కార్‌ని "పేపర్ లీక్ ప్రభుత్వం"గా అభివర్ణించింది. పేపర్ లీక్‌కు విద్యాశాఖ మంత్రి బాధ్యులుగా మారతారా అని కాంగ్రెస్ ప్రశ్నించింది.
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రె్‌సకు అంచనాల కంటే తక్కువ సీట్లు రావడానికి గల కారణాలను విశ్లేషించేందుకు నిజనిర్ధారణ కమిటీని ఏఐసీసీ నియమించింది. పార్టీ జాతీయ నాయకులు పీజే కురియన్, రఖిబుల్ హుసేన్, పర్గత్‌సింగ్‌లను ఈ కమిటీలో సభ్యులుగా నియమించింది.
పార్లమెంటు ప్రాంగణంలోని మహనీయులు విగ్రహాలను వేరే చోటికి తరలించడంపై కాంగ్రెస్ భగ్గుమంది. మహాత్మాగాంధీ, శివాజీ, బీఆర్ అంబేద్కర్ తదితర మనీయుల విగ్రహాలను తిరిగి యథాతథ స్థానాల్లోకి తీసుకురావాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్లకు లేఖ రాశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహల్ గాంధీ జన్మదిన వేడుకలు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఘనంగా(Rahul Gandhi Birthday Celebrations) జరిగాయి.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్(Rahul Gandhi Birthday) బుధవారం 54వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ సహా వివిధ పార్టీల నేతలు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు.
కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టారు. ఎన్డీయే మిత్రపక్షాలకు 292 మంది ఎంపీల బలం ఉంది. బీజేపీ సొంతంగా 240 మంది ఎంపీలున్నారు.