Home » Mallu Ravi
రాజకీయంగా పొత్తులు సాధారణమైన విషయమని.. ఇండియా కూటమిలో బీఎస్పీ(BSP) లేదని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి(Mallu Ravi) తెలిపారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయడానికి బీఎస్పీ సిద్ధంగా లేదని చెప్పారు. అందుకే బీఆర్ఎస్ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిశారని అన్నారు.త్వరలో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పారు.
Telangana: నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీపై మాజీ ఎంపీ మల్లు రవి స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... నాగర్ కర్నూల్ నుంచి పోటీలో మల్లు రవి ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు.
పార్టీని కాపాడుకోలేని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... సీఎం రేవంత్ రెడ్డిపై ఛాలెంజ్ చేయడం చూస్తుంటే నవ్వొస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పవర్ ఏమిటో చూశాక కూడా కేటీఆర్ ఇలాంటి ఛాలెంజ్‌లు చేయడం మానుకోవాలన్నారు.
కథలు చెప్పడానికే బీఆర్ఎస్(BRS) నేతలు కాళేశ్వరం వెళ్తున్నారని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి(Mallu Ravi) అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోయిందని గతంలో కేంద్ర ప్రభుత్వం పంపించిన డ్యామ్ సేఫ్టీ అధికారులు ఓ నివేదిక ఇచ్చారని తెలిపారు.
పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లురవి (Mallu Ravi) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను సీఎం రేవంత్ రెడ్డికి మల్లురవి ఇచ్చారు. తన రాజీనామాను ఆమోదిస్తారా లేక ఆమోదించకుండానే నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటిస్తారా అనేది సీఎం రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉండనున్నది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ఎందుకు సీబీఐ విచారణ జరిపించలేదని ఢిల్లీ తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి (Mallu Ravi) ప్రశ్నించారు.
కేంద్ర హోంశాఖ అధికారులతో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి(Mallu Ravi) సోమవారం నాడు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రభుత్వ అధికార ప్రతినిధి మల్లు రవి అన్నారు.
దేశ రాజధాని దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి బాధ్యతలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి తెలంగాణ పెండింగ్ అంశాల పరిష్కారానికి కృషి చేస్తానని మల్లు రవి అన్నారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని కొందరు తమ ఎదుగుదల కోసం వినియోగిస్తుంటే.. మరికొందరు మాత్రం చెడు పనులకు వాడుతున్నారు. ఆ సాంకేతికతకు తమ ప్రతిభను జోడించి.. అక్రమ మార్గాల్లో డబ్బులు దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఒక నిందితుడైతే.. ఏకంగా కాంగ్రెస్ పార్టీ పేరుతో నకిలీ వెబ్సైట్ క్రియేట్ చేసి, భారీ మోసాలకు పాల్పడ్డాడు.