Mallu Ravi: వాళ్లను అరెస్ట్ చేస్తాం..మల్లు రవి షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Dec 06 , 2024 | 02:56 PM
ప్రభుత్వం సాఫీగా నడవకుండా ఇబ్బందులకు గురి చేస్తేనే మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్‌లను అరెస్ట్ చేస్తామని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. తాము తప్పులేకుండా స్వేచ్ఛగా ప్రజాపాలన చేస్తున్నామన్నారు. 6 గ్యారెంటీల్లో ఐదు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని మల్లు రవి వివరించారు.
ఢిల్లీ: గౌతమ్ అదానీని రక్షించడం కోసం బీజేపీ ప్రభుత్వం అనుక్షణం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆరోపించారు. అధికారపక్షమే పార్లమెంట్లో చర్చ లేకుండా చేస్తోందని ధ్వజమెత్తారు. అదానీ అంశంపై ఎక్కడ అడుగుతామో అన్న ఉద్దేశంతో సభ మొదలైన మరుక్షణమే లోక్ సభ వాయిదా వేశారని చెప్పారు. ఇవాళ(శుక్రవారం) ఢిల్లీలోని పార్లమెంట్ బయట మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ... జీరో అవర్లో కూడా అలాగే వ్యవహరిస్తూ.. సభను సోమవారానికి లోక్ సభ వాయిదా వేశారని మల్లు రవి అన్నారు.
అదానీ - ప్రధానమంత్రి నరేంద్రమోదీ మధ్య సంబంధం బయటపడుతుంది అన్న ఉద్దేశంతోనే అధికారపక్షం ఇలా చేస్తుందని విమర్శించారు.. రాజ్యసభలో అదానీ అంశం నుంచి దృష్టి మళ్లించడం కోసం అభిషేక్ మను సింఘ్వీ నోట్ల కట్ట వివాదాన్ని సృష్టించారని మండిపడ్డారు. ఆయన సీట్ మీద నోట్ల కట్ట పెట్టి మరీ బీజేపీ నేతలే వివాదం సృష్టించారని ఆరోపించారు. పదేళ్లలో కేసీఆర్ చేయలేని పనులు రేవంత్ రెడ్డి చేశారని తెలిపారు. పేద ప్రజలకు 10 లక్షల రూపాయలతో ఆరోగ్యం భీమా కలిపించారని మల్లు రవి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని చెప్పారు. పదేళ్లలో 2 లక్షల డబుల్ బెడ్ రూం ఇళ్లు కూడా బీఆర్ఎస్ ఇవ్వలేదని అన్నారు. తమ ప్రభుత్వాన్ని నడవనివ్వడం లేదు కాబట్టే అరెస్టులు జరుగుతున్నాయన్నారు. పదేళ్లలో తనను ఎన్నోసార్లు హౌస్ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం సాఫీగా నడవకుండా ఇబ్బందులకు గురి చేస్తేనే మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్‌లను అరెస్ట్ చేస్తామని అన్నారు. తాము తప్పులేకుండా స్వేచ్ఛగా ప్రజాపాలన చేస్తున్నామన్నారు. 6 గ్యారెంటీల్లో ఐదు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని వివరించారు. బీజేపీ పార్టీ మీటింగ్ కు తమ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని మల్లు రవి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Congress: అస్థిరత నుంచి సుస్థిరత దాకా
CM Revanth Reddy: కేసీఆర్! ప్రతిపక్ష నేతగా.. నీ డ్యూటీ చెయ్
KTR: రేవంత్ ప్రతిష్టిస్తోంది.. తెలంగాణ తల్లినా.. కాంగ్రెస్ తల్లినా
Read Latest Telangana News And Telugu News