Mallu Ravi: తెలంగాణ సీపీపీ కన్వీనర్‌గా మల్లు రవి
ABN , Publish Date - Dec 21 , 2024 | 05:11 AM
తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) కన్వీనర్‌గా సీనియర్ ఎంపీ మల్లు రవిని ఆ పార్టీ అధినాయకత్వం నియమించింది. తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు కూడా సీపీపీ కన్వీనర్లను నియమించారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) కన్వీనర్‌గా సీనియర్ ఎంపీ మల్లు రవిని ఆ పార్టీ అధినాయకత్వం నియమించింది. తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు కూడా సీపీపీ కన్వీనర్లను నియమించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి, ఎంపీ అమర్ సింగ్ శుక్రవారం పేర్లను ప్రకటించారు. కేరళ, లక్షద్వీప్ కన్వీనర్‌గా ఆంటోనీ, తమిళనాడు, పుదుచ్చేరికి జోతిమణి, కర్ణాటకకు చంద్రశేఖర్, మహారాష్ట్ర, గోవాకు ప్రణీతి శిందే, రాజస్థాన్, గుజరాత్‌కు బ్రిజేంద్ర, హరియాణాకు వరుణ్ చౌదరి, పంజాబ్, చంఢీగఢ్ జమ్మూకశ్మీర్‌కు గుర్జీత్ సింగ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌కు ఇమ్రాన్ మసూద్, జార్ఖండ్, ఛత్తీ్‌సగఢ్, బిహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు సుఖ్‌దేవ్ భగత్, అసోం, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్‌కు రకిబుల్ హుేస్సన్‌లను సీపీపీ కన్వీనర్లుగా నియమించారు.