Home » Mamata Banerjee
ముచ్చటగా మూడోసారి కేంద్రంలో కొలువు తీరిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం అయిదేళ్లు పాలన సాగించలేదని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం కూలిపోతుందని ఆమె పేర్కొన్నారు.
పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ మధ్య వివాదాలు సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఎన్నికల ముందు నుంచి రాజ్‌భవన్, సీఎంవోకు మధ్య విబేధాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఉత్తర దినాజ్‌పూర్‌లోని చోప్రాలో అక్రమ సంబంధం పెట్టుకున్నారంటూ ఓ జంటపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటనలో మరో వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అమిరుల్ ఇస్లాం అలియాస్ బదువాను ఈ రోజు ఉదయం బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఇస్లాంపూర్ పోలీస్ స్టేషన్ అధికారుల బృందం అరెస్ట్ చేసింది.
పశ్చిమబెంగాల్ ఉత్తర దినాజ్‌పూర్‌లోని చోప్రాలో అక్రమ సంబంధం పెట్టుకున్నారంటూ ఓ జంటపై అధికార టీఎంసీ నేత తాజ్ముల్ దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అయితే ఈ దాడి వీడియో కేసు మంగళవారం కీలక మలుపు తిరిగింది.
ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా ‘చోప్రా’ ఘటన వీడియోపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద్ బోస్ స్పందించారు. ఈ ఘటనపై ఆయన షాక్‌కు గురయ్యారు. ఇది అనాగరికమైన చర్య అని అభివర్ణించారు.
పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee)కి ఆ రాష్ట్ర గవర్నర్‌కి మధ్య పరిస్థితి ఉప్పు నిప్పుల మారింది. తన పరువుకు దీదీ భంగం కలిగించారని ఆరోపిస్తూ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్(CV Ananda Bose) ఆమెపై పరువు నష్టం దావా వేశారు.
నీట్ పరీక్షను పూర్తిగా రద్దుచేయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Benerjee) కోరారు. ప్రశ్నపత్రం లీకేజీపై సమగ్ర నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని ప్రధాని మోదీకి(PM Modi) సోమవారం లేఖ రాశారు.
నీట్‌ను పూర్తిగా రద్దుచేయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోరారు. ప్రశ్నపత్రం లీకేజీపై సమగ్ర, నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని ప్రధాని మోదీకి సోమవారం లేఖ రాశారు.
కేరళలోని వయనాడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్న ప్రియాంక గాంధీ తరఫున ప్రచారం చేయడానికి టీఎంసీ అధినేత్రి మమత వెళ్లనున్నారు.
గతేడాది(2023) రాష్ట్రపతి ఆమోదం పొందిన మూడు క్రిమినల్ చట్టాల(New Criminal Laws) అమలును వాయిదా వేయాలని కోరుతూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ప్రధాని మోదీకి(PM Modi) శుక్రవారం లేఖ రాశారు. సభలో ఎలాంటి చర్చ లేకుండానే వీటిని ఆమోదించారని.. చట్టాలపై మరోసారి సమీక్ష జరపాలని ఆమె తన లేఖలో పేర్కొన్నారు.