Bangladesh: మమతా బెనర్జీపై నిప్పులు చెరిగిన బీజేపీ
ABN , Publish Date - Jul 21 , 2024 | 09:20 PM
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల సంస్కరణలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దాంతో దేశంలో కర్ఫ్యూ విధించారు. అయినా అల్లర్లు మాత్రం అదుపులోకి రావడం లేదు.
న్యూఢిల్లీ, జులై 21: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల సంస్కరణలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దాంతో దేశంలో కర్ఫ్యూ విధించారు. అయినా అల్లర్లు మాత్రం అదుపులోకి రావడం లేదు. అలాంటి వేశ.. బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న హింసతో బాధితులుగా మారిన వారికి పశ్చిమ బెంగాల్‌లో ఆశ్రయం కల్పిస్తామంటూ సీఎం మమతా బెనర్జీ ఆదివారం కోల్ కతాలో నిర్వహించిన ర్యాలీలో ప్రకటించారు.
Also Read: Odisha: వ్యతిరేకతతో వెనక్కి తగ్గిన మాఝీ ప్రభుత్వం
ఆమె ప్రకటనపై బీజేపీ ఆ రాష్ట్ర సహా బాధ్యుడు అమిత్ మాలవ్య మండిపడ్డారు. ఝార్ఖండ్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయని.. ఈ ఎన్నికల్లో ఇండియా కూమిటీ గెలుపు కోసం వేసిన దుర్మార్గపు ప్రణాళిక అని ఆయన అభిర్ణించారు. అయితే ఇతర దేశీయులకు భారత్‌లో ఆశ్రయం ఇస్తామంటు సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. ఆ అధికారం ఆమెకు ఎవరిచ్చారని ప్రశ్నించారు.
Also Read: Union Budget 2024: రికార్డు సృష్టించనున్న నిర్మలమ్మ
Also Read: Vizianagaram: శ్రీ విద్యా పీఠంలో గురుపౌర్ణమి వేడుకలు
ఇతర దేశాలకు చెందిన పౌరుల వలసలు, వారికి పౌరసత్వం జారీ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని ఈ సందర్భంగా అమిత్ మాలవ్య గుర్తు చేశారు. బెంగాల్‌లో అక్రమంగా నివసిస్తున్నవారి ద్వారా ఝార్ఖండ్ ఎన్నికల్లో గెలుపు కోసం ఇండియా కూటమి ఈ తరహా దుర్మార్గపు ప్రణాళికలు రూపొందిస్తుందని మండిపడ్డారు.
Also Read: Haryana: హర్యానాలోని నుహ్‌లో ఇంటర్నెట్ సేవలు బంద్
Also Read: Arvind Kejriwal: బీజేపీతోపాటు ఎల్జీపై మళ్లీ మండిపడ్డ ఆప్
అయితే భారత్‌తో పశ్చిమ బెంగాల్‌కు వీడదీయరాని బంధముందని.. ఈ విషయాన్ని ముందు సీఎం మమతా బెనర్జీ తెలుసుకోవాలని ఆయన సూచించారు. మాతృ దేశం కోసం లక్షలాది మంది విప్లవకార్లుగా బెంగాల్ హిందువులు తమ రక్తాన్ని చిందించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే ఈ తరహా భాషను సీఎం మమతా ఉపయోగించడం ఏమాత్రం తగదన్నారు.
Also Read: Mamata Banerjee: బంగ్లా బాధితులకు ఆశ్రయం.. కీలక ప్రకటన
Also Read: New Delhi: జగన్ పాలనలో అప్పులు ఘనం.. అభివృద్ధి శూన్యం
బెంగాల్ ప్రజలను చాలా తక్కువ అంచనా వేస్తుందంటూ మమతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఆగ్రహానికి గురి కావాల్సి ఉందంటూ ఈ సందర్భంగా మమతా బెనర్జీని అమిత్ మాలవ్య హెచ్చరించారు. ఆమె ఏవో కలలు కంటుంది.. అవి కల్లలయ్యే రోజు సమీపంలోనే ఉందని ఆయన పేర్కొన్నారు.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News