Share News

Bangladesh: సీఎం మమత వ్యాఖ్యలపై స్పందించిన బంగ్లాదేశ్

ABN , Publish Date - Jul 24 , 2024 | 06:11 PM

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల సంస్కరణల కోసం హింస చెలరేగింది. ఈ నేపథ్యంలో ఆ దేశంలోని హింసతో బాధితులుగా మారిన వారికి కోల్‌కతాలో ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల ప్రకటించారు.

Bangladesh: సీఎం మమత వ్యాఖ్యలపై స్పందించిన బంగ్లాదేశ్
West Bengal Chief Minister Mamata Banerjee

ఢాకా/కోల్‌కతా, జులై 24: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల సంస్కరణల కోసం హింస చెలరేగింది. ఈ నేపథ్యంలో ఆ దేశంలోని హింసతో బాధితులుగా మారిన వారికి కోల్‌కతాలో ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల ప్రకటించారు. ఆమె ప్రకటనపై బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి హసన్ మహ్మమూద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం మమతా బెనర్జీ చేసిన ప్రకటన తాలుక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Telangana Assembly: ‘అయ్యేదుంటే సీఎం కావచ్చు’


ఈ వీడియోను వీక్షించిన అనంతరం బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి హసన్ మహ్మమూద్ స్పందించారు. మమతా బెనర్జీ అంటే తమకు గౌరవముందన్నారు. పరస్పర అవగాహనతో.. ఆసక్తితో.. తాము సంబంధాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. అయితే మమతా బెనర్జీ చేసిన ఈ ప్రకటన.. గందరగోళం సృష్టించే విధంగా ఉండడమే కాకుండా.. ప్రజలను సైతం గందరగోళంలో పడేసే విధంగా ఉందని చెప్పారు. ఆ క్రమంలో ఆమె ప్రకటనపై భారత ప్రభుత్వానికి నోట్ పంపినట్లు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి వివరించారు.

Also Read: jammu and kashmir: రాష్ట్రంలో మెరుగు పడ్డ శాంతి భద్రతలు


ఇక మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బీజేపీ నేత అమిత్ మాలవ్య సైతం ఎక్స్ వేదికగా మరోసారి స్పందించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్‌కే కాదు.. ప్రస్తుతం భారతదేశానికే సైతం ఇబ్బందికరంగా మారారని వ్యాఖ్యానించారు.

Also Read: AP Floods: రైతుల కోసం పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వినూత్న నిరసన


జులై 21వ తేదీన కోల్‌కతా మహానగరంలో అమరవీరుల దినోత్సవం సందర్బంగా ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పాల్గొన్న సీఎం మమతా బెనర్జీ.. బంగ్లాదేశ్‌ బాధితులకు కోల్‌కతాలో ఆశ్రయం కల్పిస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనపై బీజేపీ నేత అమిత్ మాలవ్య నాడే స్పందించారు. పొరుగు దేశం బంగ్లాదేశ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకూడంటూ మమత ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందన్నారు. అయితే త్వరలో ఝార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయని.. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపు కోసం మమతా ఈ తరహా వ్యాఖ్యలు చేశారంటూ అమిత్ మాలవ్య ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే.

Also Read: AP Assembly: అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్


ఇంకోవైపు.. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లు సంస్కరించాలంటూ దేశవ్యాప్తంగా విద్యార్దులు ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. వారికి ప్రజల మద్దతు సైతం తోడు అయింది. దీంతో దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలు హింసకు దారి తీశాయి. దాంతో ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించినా.. పరిస్థితి మాత్రం అదుపులోకి రాలేదు. అలాంటి వేళ.. విద్యార్థి సంఘాల నాయకులతో చర్చలకు ప్రభుత్వం సిద్దమైన విషయం విధితమే.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 24 , 2024 | 06:12 PM