Budget 2024: దిశానిర్దేశం లేని బడ్జెట్... మమత విసుర్లు
ABN , Publish Date - Jul 23 , 2024 | 07:26 PM
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25పై పశ్చిమబెంగాల్ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. దిశానిర్దేశం లేని, ప్రజావ్యతిరేక, రాజకీయ పక్షపాత బడ్జెట్ అని అభివర్ణించారు.
కోల్‌కతా: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25 (Union Budget 2024-25)పై పశ్చిమబెంగాల్ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) విమర్శలు గుప్పించారు. దిశానిర్దేశం లేని, ప్రజావ్యతిరేక బడ్జెట్ అని అభివర్ణించారు. బడ్జెట్‌లో విజన్ లోపించిందని, పూర్తిగా రాజకీయ ఉద్దేశాలతో రూపొందించారని అని చెప్పారు. ''వెలుగు ఎక్కడా కనిపించడం లేదు, అంతా చీకటే'' అని అన్నారు.
Nitish on Specail Status: ప్రత్యేక హోదా అడిగాం కానీ.. నితీష్ రియాక్షన్
''సామాన్య ప్రజానీకానికి ఒరిగేదేమీ లేదు. పేదలు, ప్రజావ్యతిరేక బడ్జెట్ ఇది. రాజకీయ పక్షపాతంతో కూడుకొంది. కేవలం ఒక పార్టీని బుజ్జగించేందుకు తెచ్చిన బడ్జెట్'' అని మమత అన్నారు. బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ, ఎన్నికల్లో వాళ్లు చాలా పెద్దపెద్ద వాగ్దానాలు చేసి వాటిని నెరవేర్చలేదని తప్పుపట్టారు. ఓట్లు గెలిచిన తర్వాత డార్జిలింగ్, కలింపాంగ్‌ను మరిచిపోయారని, డార్జిలింగ్ ప్రజలు మాత్రం ఈ విషయం గుర్తుపెట్టుకుంటారని చెప్పారు. సిక్కిం రాష్ట్రానికి వరాలు ప్రకటించడంపై తమకెలాంటి అభ్యంతరాలు లేవని, అయితే డార్జిలింగ్ ఎలాంటి ప్రయోజనాలకు నోచుకోకపోవడం మాత్రం సరికాదని అన్నారు.
Read Latest Telangana News and National News