Home » Mamata Banerjee
పశ్చిమ బెంగాల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల కుంభకోణంపై కోల్కత్తా హైకోర్టు ఇటీవల సీబీఐ విచారణకు ఆదేశించింది. అయితే కోల్కత్తా హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. దీంతో మమతా బెనర్జీ ప్రభుత్వానికి తాత్కాలిక ఊరట లభించినట్లు అయింది. దాదాపు 24 వేల మంది బోధన, బోధనేతర సిబ్బంది నియామకం కోసం.. 2016లో వెస్ట్ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహించింది.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం నిప్పులు చెరిగారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో సందేశ్‌కలీలోని షేక్ షాజహాన్ తరహా సంఘ విద్రోహ శక్తులు ఉన్నారని ఆయన విమర్శించారు.
పశ్చిమబెంగాల్ సీఎం మమత మరోసారి గాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బర్ధమాన్ జిల్లాలోని దుర్గాపూర్ నుంచి అసన్సోల్కు వెళ్లేందుకు శనివారం ఆమె హెలికాప్టర్ ఎక్కారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మళ్లీ గాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అమె సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఆ క్రమంలో దుర్గాపూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం అసన్సోల్ వెళ్లేందుకు ఆమె హెలికాఫ్టర్ ఎక్కారు.
అభిషేక్ బెనర్జీ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించడం సంచలనం సృష్టించిన నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెక్కీ నిర్వహించిన వ్యక్తికి అభిషేక్ అపాయింట్మెంట్ ఇచ్చి ఉంటే తన మేనల్లుడిని వాళ్లు కాల్చి చంపేసేవాళ్లని అన్నారు.
పశ్చిమ బెంగాల్లో ‘2016 టీచర్ రిక్రూట్మెంట్’ ద్వారా నియమితులైన 26 వేల మంది ఉద్యోగాలను రద్దు చేస్తూ.. కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ఉపాధ్యాయ నియామక ప్రక్రియను పూర్తిగా రద్దు చేయడం...
కోల్కత్తా హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో నియమించిన 24 వేల ఉపాధ్యాయుల నియామకాన్ని రద్దు చేసింది. జస్టిస్ దేబాంగుశ్ బసక్, షబ్బార్ రషీద్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశించింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ( Mamata Banerjee ) ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రామనవమి వేడుకల సందర్భంగా బెంగాల్ లోని ముర్షిదాబాద్ లో జరిగిన హింసపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈద్ సెలబ్రేషన్స్ కోసం బెంగాల్ వచ్చిన వలస కార్మికులు ఓటు వేయకుండా మాత్రం తిరిగి వెళ్లవద్దని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. ముర్షీదాబాద్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీఎం మాట్లాడుతూ, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం తిరిగి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఓటు వేయని వాళ్ల ఆధార్ కార్డులు, పౌరసత్వాన్ని ఊడ లాక్కుంటుందని హెచ్చరించారు.
ముర్షిదాబాద్ ఘటన ముందస్తు ప్రణాళికతో జరిగిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ( Mamata Banerjee )మండిపడ్డారు. ఈ ఘటనకు బీజేపీ నేతలే కారణమని ఆరోపించారు. రాయ్‌గంజ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె సంచలన కామెంట్లు చేశారు.