Home » Mamata Banerjee
బీజేపీపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి నిప్పులు చెరిగారు. రాజకీయ లబ్ది కోసం ఆ పార్టీ ఎన్నికల ప్రవర్తన నియమావళిని అతిక్రమిస్తోందని ఆరోపించారు. కూచ్ బిహార్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో బీజేపీని లక్ష్యంగా చేసుకొని ఆమె ఆరోపణలు గుప్పించారు.
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీ అధినేతలు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ కూచ్ బెహర్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లక్ష్యంగా విమర్శలు చేశారు. అందుకు దీదీ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ బిజీగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో గల కూచ్ బిహర్లో గురువారం నాడు ప్రచారం చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సందేశ్ ఖాళి ఘటనను ప్రధాని మోదీ ఉదహరించారు. నిందితుడిని కాపాడేందుకు దీదీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేసిందని విరుచుకుపడ్డారు.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై కోల్ కతా హైకోర్టు గురువారం నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సందేశ్‌ఖాళి ఘటనకు సంబంధించి అఫిడవిట్లపై చీఫ్ జస్టిస్ టీఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. సందేశ్‌ఖాళిలో టీఎంసీ నేత షేక్ షాజహాన్, అతని అనుచరులు దోపిడీ, భూ కబ్జా, లైంగిక వేధింపుల గురించి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఆకస్మాత్తుగా వచ్చిన తుఫాను,(Cyclone) వర్షం కారణంగా పశ్చిమ బెంగాల్(West Bengal)లోని అనేక ప్రాంతాలు వినాశనానికి గురయ్యాయి. ప్రధానంగా జల్పైగురి జిల్లా(Jalpaiguri district)లోని పలు ప్రాంతాల్లో తుఫాను భారీ విధ్వంసం సృష్టించింది. ఈదురు గాలుల వల్ల జిల్లా కేంద్రమైన పట్టణంతోపాటు మైనగురి తదితర పరిసర ప్రాంతాల్లో అపార నష్టం జరిగింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం బీజేపీకి ఓ సవాల్ విసిరారు. త్వరలో రాబోయే ఎన్నికల్లో 400కు పైగా సీట్లు గెలుస్తామని చెప్పుకుంటున్న బీజేపీ.. కనీసం 200 స్థానాల్లో అయినా గెలిచి చూపించాలని ఛాలెంజ్ చేశారు. అంతేకాదు.. బెంగాల్ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం అమలును తాము ఏమాత్రం అనుమతించబోమని తేల్చి చెప్పారు.
సీఏఏపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు రాజుకుంటున్నాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని కొందరు వ్యతిరేకిస్తుండగా మరికొందరు స్వాగతిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు రాజకీయ నేతలు చేసిన కామెంట్లు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
దేశ వ్యాప్తంగా పెను సంచలనం కలిగించిన సందేశ్‌ఖలీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న షాజహాన్ షేక్ సోదరుడు ఆలంగీర్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. అతనితో పాటు మరో ఇద్దరినీ అరెస్టు చేసింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రమాదానికి గురయ్యారు. ఆమె నుదిటిపై తీవ్ర గాయాలు అయ్యాయని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సైతం షేర్ చేసింది. ఆమె నుదుటిపై గాటు పడగా, ముఖంపై రక్తం కారుతున్న దృశ్యాలను ఆ ఫోటోలో మనం చూడొచ్చు.
దేశంలో ఇటివల పౌరసత్వ సవరణ చట్టం(CAA) అమలు అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించడం మొదలుపెట్టాయి. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఈ అంశంపై స్పందించి ప్రతిపక్షాలపై మండిపడ్డారు.