Home » Mamata Banerjee
కోల్‌కతా మహానగరంలో దక్షిణ శివారు ఆనందపూర్ గ్రామంలోని రహదారి పక్కన పొదల్లో తీవ్రగాయాలతో పడి ఉన్న మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం కోల్‌కతా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మంగళవారం కోల్‌కతాలోని సీబీఐ స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయం వద్ద ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌తో అత్యంత సన్నిహితంగా మెలిగే ఏఎస్ఐ అరుప్ దత్తా సీబీఐ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి వచ్చారు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు అతడిని ప్రశ్నించేందుకు ప్రయత్నించారు.
కోల్ కతా వైద్యురాలి మృతి ఘటన ప్రకంపనలు రేపుతోంది. నిందితులపై చర్యలు తీసుకోవాలని యావత్ భారతవని కోరుతోంది. వైద్యురాలి మృతికి సంఘీభావంగా పలువురు తమ సోషల్ మీడియా అకౌంట్లలో స్టేటస్‌ను బ్లాక్ కలర్‌గా మార్చారు. తమదైన శైలిలో నిరసన తెలియజేస్తున్నారు. ఆ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేరారు.
కోల్‌కతాలోని ఆర్జీ కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలోని జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం కేసును సీబీఐ విచారిస్తోంది. ఈ కేసులో నిందితుడైన సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు కోల్‌కతా కోర్టు సీబీఐకి అనుమతినిచ్చింది.
కోల్‌కతా వైద్యురాలి మృతిపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. బెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వైద్య సంఘాలు ఆందోళనకు దిగాయి. వీలైనంత త్వరగా నిందితుడికి ఉరి శిక్ష విధించాలని కోరుతున్నాయి. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై గ్యాంగ్ రేప్ చేసి, దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొందరు మెడికల్ కాలేజీ, ఆస్పత్రిని ధ్వంసం చేశారు
సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాలేజీ విద్యార్థి కీర్తి శర్మ (23)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం కోల్‌కతా మహానగరంలో లేక్ టౌన్‌లోని నివాసంలో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
నా బిడ్డ చనిపోవడంతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వీధుల్లోకి వచ్చి చాలా బాగా మాట్లాడారు. నా బిడ్డ మృతికి న్యాయం జరగాలని ఆందోళన కూడా చేపట్టారు. అదే సమయంలో ప్రజల ఆగ్రహాన్ని అణచి వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎందుకు ద్వంద్వ విధానం అమలు చేస్తున్నారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై మృతురాలి తండ్రి ప్రశ్నల వర్షం కురిపించారు.
కోల్ కతా వైద్యురాలి మృతి యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ వినిపిస్తోంది. మృతురాలికి న్యాయం జరగాలని, వీలైనంత త్వరగా నిందితుడిని ఉరి తీయాలని యావత్ దేశం కోరుకుంటోంది. ఇదే అంశంపై ప్రముఖులు స్పందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్, సీఎం మమతా బెనర్జీకి మాజీ క్రికెటర్, ఆప్ ఎంపీ హర్బజన్ సింగ్ రెండు పేజీల బహిరంగ లేఖ రాశారు.
ఈస్ట్ బెంగాల్ వెర్సస్ మోహన్ బాగాన్ డెర్బీ జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన ఫుట్‌బాల్ మ్యాచ్‌ను పశ్చిమబెంగాల్ ప్రభుత్వం రద్దు చేసింది. మ్యాచ్‌కు తగిన భద్రత కల్పించలేమని కోల్‌కతా పోలీసులు అసక్తత వ్యక్తం చేయడంపై బీజేపీ మండిపడింది.
ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో మహిళా ట్రైనీ డాక్టరుపై అత్యాచారం, హత్య ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అనూహ్య చర్యకు దిగింది. సుమారు 43 మంది డాక్టర్లను బదిలీ చేస్తూ శనివారంనాడు ఆదేశాలు జారీ చేసింది.