Kolkata: సీఎంతో సమావేశం లైవ్ టెలికాస్ట్‌కు వైద్యులు డిమాండ్... కొనసాగుతున్న ప్రతిష్ఠంభన
ABN , Publish Date - Sep 11 , 2024 | 08:55 PM
ఆర్జీ కర్ ఆసుపత్రి ఘటనపై జూనియర్ డాక్టర్ల నిరసనతో తలెత్తిన ప్రతిష్ఠంభన 33వ రోజైన బుధవారంనాడు కూడా తొలగలేదు. చర్చలకు రావాలంటూ ప్రభుత్వం ఆహ్వానించడాన్ని స్వాగతిస్తూనే మరిన్ని కొత్త డిమాండ్లు తెరపైకి తెచ్చారు.
కోల్‌కతా: ఆర్జీ కర్ ఆసుపత్రి ఘటనపై జూనియర్ డాక్టర్ల నిరసనతో తలెత్తిన ప్రతిష్ఠంభన 33వ రోజైన బుధవారంనాడు కూడా తొలగలేదు. చర్చలకు రావాలంటూ ప్రభుత్వం ఆహ్వానించడాన్ని స్వాగతిస్తూనే మరిన్ని కొత్త డిమాండ్లు తెరపైకి తెచ్చారు. ప్రతిపాదిత సమావేశానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తప్పనిసరిగా హాజరుకావాలని, ఈ సమావేశాన్ని లైవ్ టెలికాస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మమతా బెనర్జీ హాజరవుతున్నారో లేదో ధ్రువీకరించాలని అధికారులను కోరారు.
Kolkata: సీఎంతో చర్చలకు జూనియర్ డాక్టర్లు రెడీ
దీనికి ముందు వైద్యులు విధుల్లోకి చేరాలంటూ సుప్రీంకోర్టు మంగళవారం సాయంత్రం 5 గంటలకు వరకూ గడువు ఇచ్చినప్పటికీ వారు విధుల్లోకి చేరడానికి నిరాకరించారు. జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, న్యాయం జరిగేంత వరకూ విధుల్లోకి వచ్చేది లేదని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో వారికి చీఫ్ సెక్రటరీ ఆహ్వానం పంపారు. సెక్రటేరియట్‌లో జరిగే సమావేశానికి 12 నుంచి 15 మంది వైద్య ప్రతినిధుల బృందం రావాలని కోరారు. అయితే తాము చేసిన డిమాండ్లలో చీఫ్ సెక్రటరీ రాజీనామా చేయాలనే డిమాండ్ కూడా ఉన్నప్పుడు ఆయనతో ఆహ్వానం పంపడం ఏమిటని వైద్యులు నిలదీశారు. సమావేశానికి తాము హాజరవ్వాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే ముందు తమకు కొన్ని పాయింట్లపై స్పష్టత కావాలన్నారు. పలు డిమాండ్ల ప్రభుత్వం ముందు పెట్టారు. నిరసనల్లో పలు అసోసియేషన్లు, ఆసుపత్రులకు చెందిన వైద్యులు, విద్యార్థులు పాల్గొంటున్నందున కనీసం 30 మంది ప్రతినిధులకు సమావేశంలో పాల్గొనే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సమక్షంలోనే సమావేశం జరగాలని, అదికూడా లైవ్ టెలికాస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
Read More Nationa News and Latest Telugu News
Amit Shah: రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై అమిత్ షా ట్వీట్..