Share News

RG Kar case: సీఎం మమత అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే..

ABN , Publish Date - Sep 18 , 2024 | 12:20 PM

2021 నుంచి ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ ప్రొ. సందీప్ ఘోష్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని హత్యాచారానికి గురైన ఆ కాలేజీ వైద్యురాలి తండ్రి వెల్లడించారు. ఆ నాడే ప్రొ. సందీప్ ఘోష్‌పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కఠిన చర్యలు తీసుకుని ఉంటే.. ఈ రోజు తమ కుమార్తె బతికి ఉండేదన్నారు.

RG Kar case: సీఎం మమత అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే..

కోల్‌కతా, సెప్టెంబర్ 18: 2021 నుంచి ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ ప్రొ. సందీప్ ఘోష్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని హత్యాచారానికి గురైన ఆ కాలేజీ వైద్యురాలి తండ్రి వెల్లడించారు. ఆ నాడే ప్రొ. సందీప్ ఘోష్‌పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కఠిన చర్యలు తీసుకుని ఉంటే.. ఈ రోజు తమ కుమార్తె బతికి ఉండేదన్నారు. కోల్‌కతాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన కుమార్తె హత్యాచారం కేసులో ఎవరి ప్రమేయం ఉంది, ఘటన స్థలంలో ఆధారాలు ఎవరు చేరిపి వేశారనే విషయాలు దర్యాప్తులో తేలుతాయన్నారు.

Also Read: PM Modi US Tour: ప్రధాని మోదీని కలుస్తా: డొనాల్డ్ ట్రంప్


ఈ కేసు.. ప్రస్తుతం సీబీఐ విచారణ జరుపుతుందని.. దీనిపై తానేమి వ్యాఖ్యానించబోనని ఆయన స్పష్టం చేశారు. తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై ఆందోళనకు దిగిన జూనియర్ డాక్టర్లలో ఆ బాధ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. వాళ్లంతా తన పిల్లలతో సమానమన్నారు. ఈ హత్యాచారం కేసులో నిందితులు పట్టుబడిన రోజు.. మనం విజయం సాధించినట్లు అవుతుందని ఆయన పేర్కొన్నారు.

Also Read: Maharashtra: రెండు వర్గాల మధ్య ఘర్షణ.. పోలీసులు లాఠీ చార్జి


మరోవైపు కోల్‌కతా పోలీస్ కమిషనర్‌గా మనోజ్ కుమార్ వర్మను మమతా బెనర్జీ నియమించింది. దీంతో ఆయన నగర సీపీగా మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న వినీత్ గోయేల్.. స్పెషల్ టాక్స్ ఫోర్స్‌కు బదిలీ చేసింది. ఆగస్ట్ 9వ తేదీన ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచారం ఘటన చోటు చేసుకుంది. అనంతరం ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. దీంతో పశ్చిమ బెంగాల్‌లో వైద్య సేవలు నిలిచిపోయాయి. అలాంటి వేళ.. విధుల్లో చేరాలంటూ జూనియర్ డాక్టర్లతో సీఎం మమతా బెనర్జీ చర్చలు జరిపారు. అందులోభాగంగా పలు డిమాండ్లను మమత ప్రభుత్వం ఎదుట ఉంచారు. వాటిలో కొన్నింటిని మాత్రమే సీఎం మమతా బెనర్జి ఒప్పుకున్నారు. అందులో ఒకటి కోల్‌కతా పోలీస్ కమిషనర్‌‌పై బదిలీ వేటు.

Also Read: Viral Video: ఒక్క రూపాయితో ఉద్యోగాన్ని ఊడగొట్టుకున్న ఉద్యోగి


ఇంకోవైపు ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్‌ ప్రొ. సందీప్ ఘోష్‌పై అవినీతి ఆరోపణలు వెల్లవెత్తడంతో.. ఆయన నివాసాలతోపాటు ఫామ్ హౌస్‌పై ఈడీ దాడులు చేపట్టింది. ప్రస్తుతం సందీప్ ఘోష్ సీబీఐ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.

For More National News and Telugu News

Updated Date - Sep 18 , 2024 | 12:20 PM