Home » Manipur Violence
మణిపూర్ హింసాత్మక ఘటనలకు సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ ను తప్పించకపోవడంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా బుధవారంలోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా వివరించారు. ఒక ముఖ్యమంత్రి సహకరించక పోతే ఆయనను తప్పించాల్సిన పరిస్థితి వస్తుందని, కానీ మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ పూర్తిగా కేంద్రానికి సహకరిస్తున్నారని చెప్పారు.
ఢిల్లీ: మణిపూర్ హింసాత్మాక ఘటనలపై (Manipur Violence) సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. కేసుల విచారణతో పాటు బాధితుల సహాయ, పునరావాస పర్యవేక్షణకు ముగ్గురు హైకోర్టు మాజీ మహిళా న్యాయమూర్తులతో ఒక కమిటీని అత్యున్నత న్యాయస్థానం నియమించింది.
మణిపూర్‌లో పరిస్థితిని తెలుసుకునేందుకు ఇటీవల ఆ రాష్ట్రంలో పర్యటించిన విపక్ష నేతల కూటమి ఇండియా ప్రతినితి బృందంతో సహా 21 మంది ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును బుధవారం ఉదయం 11.30 గంటలకు కలుసుకోనున్నారు. మణిపూర్‌లో పరిస్థితిని రాష్ట్రపతికి వివరించనున్నారు.
మణిపుర్ హింస, మహిళలపై జరిగిన అమానుష ఘటనలపై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు రెండవ రోజైన మంగళవారంనాడు కూడా విచారణ కొనసాగించింది. ఒకటి, రెండు ఎఫ్ఐఆర్లు మినహా ఎవరినీ అరెస్టు చేసినట్టు కనిపించడం లేదని, విచారణ నత్తనడకన సాగుతోందని సీజేఐ డీవై చంద్రచూడ్ తో కూడిన ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.
హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో మహిళలపై మే ప్రారంభం నుంచి జరుగుతున్న అమానుషాలపై ఎన్ని ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారని కేంద్రాన్ని సుప్రీంకోర్టు సోమవారంనాడు నిలదీసింది. ఇళ్ల పునర్మిర్మాణానికి ప్యాకేజీ ప్రకటించారా అని ప్రశ్నించింది.
మూడు నెలలుగా హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్(Manipur)లో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు ప్రతిపక్షాల(Opposition )కు చెందిన 21 మంది ఎంపీల బృందం శనివారం రాష్ట్ర రాజధాని ఇంఫాల్(Imphal)కు చేరుకుంది.
మణిపూర్: మైతేయీ, కుకీ వర్గాల మధ్య నెలకొన్న ద్వేషం, అపనమ్మకాల్ని అంతం చేయడానికి తాను కృషి చేస్తున్నానని మణిపూర్ గవర్నర్ అనుసూయ ఉయికే పేర్కొన్నారు. శనివారం చురచంద్‌పూర్ జిల్లాలోని ఒక సహాయ శిబిరాన్ని..
మణిపూర్ హింసపై భారత ప్రధాన న్యాయమూర్తి , సుప్రీంకోర్టుపై చేసిన వ్యాఖ్యలకు గాను చెన్నైకి చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, పబ్లిషర్ బద్రి శేషాద్రిని పోలీసులు శనివారంనాడు అరెస్టు చేశారు.
మణిపూర్ అంశంపై పార్లమెంటులో చర్చ, ప్రధాని మోదీ ప్రకటనకు పట్టుబడుతూ ప్రతిపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆగస్టు 2 లేదా 3 తేదీల్లో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన మణిపూర్ మహిళల నగ్నంగా ఊరేగించి, అత్యాచారం వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజానిజాలను నిగ్గు తేల్చాలని ఆదేశించింది.