Home » Manipur
మణిపూర్ హింసాత్మక ఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ సారథ్యంలోని ఎన్డీయే సర్కార్‌కు కుకీ పీపుల్స్ అలయెన్స్ షాక్ ఇచ్చింది. ఎన్డీయే భాగస్వామ్యం నుంచి వైదొలగుతున్నట్టు కేపీఏ ప్రకటించింది.
మణిపూర్‌లో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. బిష్ణుపూర్ జిల్లా, క్వాక్టా పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు తండ్రీకొడుకులు ఉన్నారు. ఈ తండ్రీకొడుకులిద్దరినీ ఉగ్రవాదులు కాల్చి చంపేసి, ఆ తర్వాత వారి మృతదేహాలను కత్తులతో ముక్కలు చేశారు.
మణిపూర్‌లో కుకీలు, మెయిటీల మధ్య ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి పోలీస్ స్టేషన్లపై దాడులు, ఆయుధాల దోపిడీలు విపరీతంగా జరుగుతున్నాయి. తాజాగా గురువారం బిష్ణుపూర్ జిల్లాలోని నరన్సీనా వద్ద ఉన్న ఇండియన్ రిజర్వు బెటాలియన్ (IRB) శిబిరంపై దాదాపు 500 మంది దాడి చేశారు.
ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తో సమావేశమయ్యారు. మణిపూర్ సమస్య పరిష్కారం కోసం జోక్యం చేసుకోవాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. జూలై 29, 30 తేదీల్లో ఆ రాష్ట్రంలో పర్యటించిన ఎంపీలు ఈ బృందంలో ఉన్నారు.
మణిపూర్(Manipur) హింసాకాండపై ప్రధాని మోదీ(PM MODI) ప్రకటన చేయాలంటూ ప్రతిపక్షాలు(Opposition parties) పట్టువీడకుండా నిరసనలు కొనసాగించడంతో సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల్లోపే ఉభయ సభలు వాయిదా పడ్డాయి.
మణిపూర్(Manipur)లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై సుప్రీంకోర్టు(Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
మణిపూర్ ఘటనపై మధ్యాహ్నం 2 గంటలకు పార్లమెంట్లో చర్చ జరుగుతుందని కేంద్ర మంత్రి, రాజ్యసభలో సభాపక్ష నేత పీయూష్ గోయల్ వెల్లడించారు. ప్రతిపక్ష సభ్యులు వారికి ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. మణిపూర్ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని గోయల్ తెలిపారు.
మణిపూర్‌లో తెగల మధ్య ఘర్షణలకు సత్వరమే తెర దించకపోతే, దేశ భద్రతకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతాయని ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమి ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శని, ఆదివారాల్లో రాష్ట్రంలో పర్యటించి, ఘర్షణల బాధితులను కలుసుకొని, తెలుసుకొన్న విషయాలను గవర్నర్ అనుసూయియా యూకీకి తెలిపారు. ఈ ఎంపీలు గవర్నర్‌ను కలుసుకున్న తర్వాత రాజ్ భవన్ వద్ద ఆదివారం మీడియాతో మాట్లాడారు.
మణిపూర్: మైతేయీ, కుకీ వర్గాల మధ్య నెలకొన్న ద్వేషం, అపనమ్మకాల్ని అంతం చేయడానికి తాను కృషి చేస్తున్నానని మణిపూర్ గవర్నర్ అనుసూయ ఉయికే పేర్కొన్నారు. శనివారం చురచంద్‌పూర్ జిల్లాలోని ఒక సహాయ శిబిరాన్ని..
మణిపూర్‌లో రెండు తెగల మధ్య జరుగుతున్న ఘర్షణల వెనుక విదేశీ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమని భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ ఎంఎం నరవనే (General MM Naravane) చెప్పారు. చాలా తిరుగుబాటు సంస్థలకు చైనా సహాయం అందుతోందని తెలిపారు. సరిహద్దుల్లోని రాష్ట్రాల్లో అస్థిరత వల్ల దేశ భద్రతకు శ్రేయస్కరం కాదన్నారు.