Share News

Manmohan Singh: మన్మోహన్‌సింగ్‌ స్మారకం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం

ABN , Publish Date - Jan 02 , 2025 | 05:32 AM

దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ స్మారకాన్ని నిర్మించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.

Manmohan Singh: మన్మోహన్‌సింగ్‌ స్మారకం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం

స్థలాన్ని ఎంపిక చేయాలని సింగ్‌ కుటుంబాన్ని కోరిన కేంద్రం

న్యూఢిల్లీ, జనవరి 1: దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ స్మారకాన్ని నిర్మించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా రాజ్‌ఘాట్‌, రాష్ర్టీయ స్మృతి స్థల్‌ లేదా కిసాన్‌ ఘాట్‌లకు సమీపంలో ప్రతిపాదించిన స్థలాన్ని ఎంపిక చేయాలని సింగ్‌ కుటుంబాన్ని కోరినట్టు తెలుస్తోంది. స్మారకం కోసం ఒకటి నుంచి ఒకటిన్నర ఎకరాల స్థలాన్ని ప్రతిపాదించినట్టు సమాచారం. ఈ ప్రాంతాలను ఇప్పటికే పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారులు పరిశీలించారు. నూతన విధానం ప్రకారం స్మారకానికి అవసరమైన స్థలాన్ని కేటాయించడానికి ముందు ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తర్వాత భూమి కేటాయింపునకు దరఖాస్తు చేయాలి. స్మారకం నిర్మాణానికి సంబంధించి సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ (సీపీడబ్ల్యూడీ)తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. మన్మోహన్‌ సింగ్‌ కుటుంబంతో సంప్రదించిన తర్వాతే స్మారకం స్థలాన్ని ఖరారు చేయనున్నట్టు సంబంఽధిత వర్గాలు చెబుతున్నాయి. కాగా జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, సంజయ్‌ గాంధీల స్మారకాలున్న రాజ్‌ఘాట్‌ కి సమీపంలో మన్మోహన్‌ సింగ్‌ స్మారకానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

Updated Date - Jan 02 , 2025 | 05:32 AM