Share News

Telangana Assembly: నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

ABN , Publish Date - Dec 30 , 2024 | 03:44 AM

దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతికి సంతాపం తెలపడానికి సోమవారం శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

Telangana Assembly: నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

  • మన్మోహన్‌ సింగ్‌కు నివాళులర్పించేందుకే

హైదరాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతికి సంతాపం తెలపడానికి సోమవారం శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ప్రధానిగా మన్మోహన్‌ సింగ్‌ చొరవ తీసుకున్నందుకు కృతజ్ఞతగా అసెంబ్లీలో నివాళులర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 10 గంటలకు సభ సమావేశం ప్రారంభం కానుంది. సీఎం రేవంత్‌రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టి ప్రసంగించనున్నారు. ఈ ప్రత్యేక సమావేశాల ఏర్పాట్లను స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌తో కలిసి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆదివారం పరిశీలించారు.

Updated Date - Dec 30 , 2024 | 03:44 AM