Manmohan Singh Death: వియత్నాంలో న్యూఇయర్ వేడుకలకు రాహుల్... బీజేపీ విమర్శ
ABN , Publish Date - Dec 30 , 2024 | 04:14 PM
దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో ఏడు రోజుల సంతాప దినాలను దేశం పాటిస్తుండగా, న్యూఇయర్ వేడుకల్లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ వియత్నాం వెళ్లడాన్ని బీజేపీ ప్రశ్నించింది.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై తాజా వివాదానికి బీజేపీ తెరలేపింది. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో ఏడు రోజుల సంతాప దినాలను దేశం పాటిస్తుండగా, న్యూఇయర్ వేడుకల్లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ వియత్నాం వెళ్లడాన్ని ప్రశ్నించింది. బీజేపీ ప్రతినిధి అమిత్ మాలవీయ సోషల్ మీడియాలో ఈ మేరకు ఒక పోస్ట్ పెట్టారు.
Nitesh Rane: కేరళ మినీ పాకిస్థాన్... ఆందుకే వాళ్లిద్దరూ ఎంపీలయ్యారు
''డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంతో యావద్దేశం నివాళులర్పిస్తోంది. సంతాపదినాలు పాటిస్తోంది. రాహుల్ మాత్రం న్యూఇయర్ వేడుకల కోసం వియత్నాం వెళ్లారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం సింగ్ మరణాన్ని వాడుకుంటున్నారు. కానీ ఆయన పట్ల మాత్రం ఎలాంటి చిత్తశుద్ధి చూపడం లేదు. సిక్కులంటే గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్‌కు పడదు. దర్బార్ సాహిబ్‌ను ఇందిరాగాంధీ అపవిత్రం చేసిన విషయాన్ని ఎవరూ మరిచిపోలేదు'' అని అమిత్ మాలవీయ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.
కాంగ్రెస్ కౌంటర్
అమిత్ మాలవీయ పోస్టుపై కౌంటర్ వెంటనే ప్రతిస్పందించింది. "తప్పుదారి పట్టించే రాజకీయాలకు సంఘీలు ఎప్పుడు ఫుల్‌స్టా్ప్ పెడతారు? డాక్టర్ సాహెబ్ అంత్యక్రియలను యమునా నదిఒడ్డున జరిపేందుకు మోదీ నిరాకరించారు. డాక్టర్ సాబెహ్ కుటుంబం పట్ల ఆయన మంత్రులు వ్యవహరించిన తీరు లజ్జాకరం. రాహుల్ ప్రైవేటు పర్యటనకు వెళ్తే మీకు వచ్చిన బాధేంటి? కొత్త సంవత్సరంలోనైనా స్వస్థులు కండి" అని కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాగూర్ ట్వీట్ చేశారు.
తొంభై రెండేళ్ల మన్మోహన్ డిసెంబర్ 26న తుదిశ్వాస విడిచారు. నిగమ్‌బోధ్ ఘాట్ వద్ద ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఇటీవల అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన కుటుంబ సభ్యులు అదివారం ఉదయం నిగమ్‌బోద్ ఘాట్‌లో ఆస్థికలను సేకరించి వాటిని మజ్ను కా తిలా గురుద్వారా సమీపంలో గల యమునా నది ఘాట్‌లో సిక్కు సంప్రదాయాల ప్రకారం నిమజ్జనం చేశారు.
ఇవి కూడా చదవండి:
Prashant Kishore: పరీక్ష రద్దు చేయాలని విద్యార్థుల ఆందోళన.. కీలక నేత అరెస్ట్
Kumbh Mela 2025: మహా కుంభమేళాకు.. రూ.7,500 కోట్లు
Read More National News and Latest Telugu News